Nobel peace award presented to sathyarthi and malala

pnobel peace award, nobel awards, sathyarthi, khailash sathyarthi, india nobel ward winners, nobel award winners, malala, pakistan nobel winners, akistan nobel award winners

nobel peace award presented to khailash sathyarthi (india), and pakistan girl (malala)

అత్యంత చిన్నది... అదరగొట్టింది..!!

Posted: 12/11/2014 11:42 AM IST
Nobel peace award presented to sathyarthi and malala

ఒక పక్క భారత్ పాక్ ల మధ్య ప్రచ్చన్న "యుద్ధం" నడుస్తుంటే ఇంకో పక్క నోబెల్ వేదికపై జరిగిన కార్యక్రమం లో ఇరుదేశాలకు చెందిన భారతీయుడు కైలాష్ సత్యార్తి, పాకిస్తాన్ బాలిక మలాలా యూసఫ్ జాహి కలిసి సంయుక్తంగా నోబెల్ "శాంతి" పురస్కారాన్ని అందుకున్నారు. ఇరు దేశాల మధ్య అంతర్గత యుద్ధ వాతవరానం నెలకొన్న పరిస్థితిలో ఇద్దరు కలిసి శాంతి బహుమతి ని స్వీకరించి ఇరు దేశాలకు ఆదర్శ ప్రాయులయ్యారు. ఈ అవార్డు ను స్వీకరిస్తున్నపుడు విశ్వ ‘శాంతి’ పతాకగా రెపరెపలాడింది. ఒకరు పాకిస్తాన్ నుంచి వస్తే మరొకరు భారత్ నుంచి వచ్చారు. ఒకరు ముస్లిం. మరొకరు హిందువు. ప్రపంచమంతా ప్రస్తుతం కోరుకుంటున్న మరింత ఐకమత్యం, దేశాల సౌభ్రాతృత్వాకు వీరు ప్రతీకలు.

వారిద్దరి కృషి బాలల హక్కుల ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటేలా చేసింది. బాలల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న భారత్‌కు చెందిన కైలాశ్ సత్యార్థి(60), పాక్ బాలిక మలాలా యూసఫ్ జాయ్(17) చరిత్రలో నిలిచిపోయేలా అరుదైన గౌరవం పొందారు.

ఈ కార్యక్రమం లో మలాలా అత్యంత ఆకర్షణగా నిలిచింది. దానికి ఒక కారణం ఉంది ఈ అవార్డు తీసుకున్న వాళ్ళలో ఎంతో మంది మేధావులు ఎంతో మంది సర్వ విజ్ఞాన సంపన్నులు ఉన్నారు. కాని వాళ్ళ వయసులో ఎంతో పెద్దవాళ్ళు అయి ఉండవచ్చు కాని ఈ అవార్డు తీసుకున్న వాళ్ళలో మలాలా అత్యంత పిన్న వయస్కురాలు (17 సంవత్సరాలు) కాని ఆమె చేసిన పని ప్రపంచం మొత్తం గర్వించదగ్గ పని. ఆ చిన్నది ఈ కార్యక్రమం లో ప్రసంగిస్తూ ఈ అవార్డ్ నాది మాత్రమే కాదు. చదువుకోవాలనుకుంటోన్న చిన్నారులు.. భయానక పరిస్థితుల్లో ఉంటూ శాంతిని కోరుకుంటున్న చిన్నారులు.. మార్పును కోరుకుంటున్న చిన్నారులు.. వీరందరిదీ ఈ అవార్డు అని చెప్పినప్పుడు చప్పట్లు మారుమోగాయి.

నోబెల్ బహుమతి పురస్కార గ్రహితలైన సత్యార్తి మరియు మలాలా ను ఇద్దర్ని మోడీ అభినందిచారు. ఖైలాష్ సత్యార్తి ని ఉద్దేశించి దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్వ పడుతుందని తన సందేశం లో పేర్కొన్నారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kailash sathyarthi  nobel awards ceremony  nobel peace award  malala  

Other Articles