Telangana government says all online buyers should pay vat tax

vat, value added tax, kcr, teangana goverment budget, telangana budget, online buyers vat, souls pay vat, tax, income tax, telangana

telanagna governemnet has decided to gave the noices to oniline buyers. the officials says they have to pay vat here

ఇక్కడ అమ్మితే ఇక్కడే పన్ను కట్టాలి...!!

Posted: 12/11/2014 11:05 AM IST
Telangana government says all online buyers should pay vat tax

ఈ మధ్య ఆన్ లైన్ అమ్మకాలకు వీపరీతమైన గీరాకి ఏర్పడినట్లు గుర్తెరిగిన తెలంగాణా ప్రభుత్వం ఒక విధానాన్ని రూపకల్పన చేసే పని లో పడింది. ఆన్‌లైన్‌లో అమ్మకాలు సాగిస్తున్న సంస్థలు రాష్ట్రంలో విక్రయాలు చేసిన పక్షంలో... వాటికి సంబంధించిన వ్యాట్‌ను తెలంగాణలోనే చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఆదేశాలను ఇచ్చింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీల్లో ఉంటున్న పలు సంస్థలు ఆన్‌లైన్‌లో వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకుంటూ... సదరు వస్తువులు, సామగ్రిని కొరియర్ సంస్థలతోనో, తమ నెట్‌వర్క్‌తోనో వినియోగదారులకు అందిస్తున్నాయి. రాష్ట్రంలో ఆన్‌లైన్ అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఇక్కడ షాపింగ్ మాల్స్‌లో అమ్మకాలు పడిపోయి వ్యాట్ ఆదాయం తగ్గుతోంది.

దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఆన్ లైన్ కొనుగోళ్ళ ద్వార వివిధ ప్రాంతాల నుండి రాష్ట్రానికి వచ్చే వస్తువులపైన పన్ను ని విధింఛి ఆదాయాన్ని సముపార్జించుకోవాలని భావించింది.  దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్, ఓఎల్‌ఎక్స్ తదితర ఆన్‌లైన్ విక్రయాల సంస్థలతో సమావేశం నిర్వహించినట్లు  ఉన్నతాధికారి ఒకరు వివరించారు. అయితే, దీనిపై ఆ సంస్థల ప్రతినిధులు స్పందించలేదని సమాచారం. ఆన్‌లైన్ విక్రయ సంస్థలు పన్ను చెల్లించడానికి నిరాకరిస్తే ఆయా సంస్థల కార్యాలయాలపై దాడులు చేసి, రాష్ట్రంలోని వినియోగదారులకు అమ్మినట్లు తేలితే, నోటీసులు జారీ చేసి.. పన్నులు వసూలు చేస్తామని ఆ అధికారులు చేపటం గమనార్హం.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  telanagna government  online buyers  vat  cmo telangana  

Other Articles