Tamilnadu congress committee president evks elangovan request kamal hassan rajnikanth political entry

tamilnadu congress committee president evks elangovan, evks elangovan latest news, evks elangovan comments, evks elangovan comments kamal hassan, evks elangovan comments rajnikanth, evks elangovan press meet, evks elangovan interview, evks elangovan news, kamal hassan latest news, kamal hassan news, kamal hassan political entry, kamal hassan interview, kamal hassan press meet, rajnikanth news, rajnikanth latest news, rajnikanth political settar

tamilnadu congress committee president evks elangovan requesting kamal hassan rajnikanth to not enter in politics

కమల్, రజనీలను వేడుకుంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు

Posted: 11/17/2014 09:19 PM IST
Tamilnadu congress committee president evks elangovan request kamal hassan rajnikanth political entry

లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరూ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు గతకొన్నాళ్లనుంచి వస్తున్న విషయం తెలిసిందే! అయితే ఆ వ్యవహారంపై తలోకరు తమతమ అభిప్రాయాలను కూడా వెల్లడించారు. ‘క్లీన్ ఇండియా క్యాంపెయిన్’ను ప్రారంభించిన కమల్.. ఆ నేపథ్యంలోనే మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రానని పేర్కొన్నారు. అలాగే ‘లింగా’ ఆడియో ఆవిష్కరణలో.. తాను రాజకీయ ఊబిలో ఇరుక్కోదలచుకోలేనని, అయితే దేవుడు ఆదేశిస్తే తాను వచ్చే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. ఏదైతేనేం.. వీళ్లు మాత్రం రాజకీయాల్లోకి రామని ఖరాఖండీగా తేల్చిపారేశారు.

అయితే బీజేపీ పార్టీ మాత్రం వీళ్లిద్దరినీ తమ పార్టీలో చేర్చుకోవాలనే ఆశతో నానారకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు వారిద్దరితో నేరుగా కలిసి గంటలకొద్దీ చర్చించడం, విందు భోజనాలకు ఆహ్వానించడం లాంటివి కార్యక్రమాలను నిర్వహిస్తూనే వున్నారు. ఈ ఇద్దరు సూపర్ హీరోలు తమ పార్టీలో జాయిన్ అయితే కేవలం తమిళనాటలోనే కాకుండా దక్షిణ భారతంలో తమ పార్టీ బలం మరింత పెరుగుతుందనే ఆలోచనతో ఆ పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. తామిద్దరం రాజకీయాల్లోకి రామని ఎంతగా చెబుతున్నప్పటికీ.. బీజేపీ మాత్రం వదలకుండా కంటిన్యూగా ప్రయత్నాలు చేస్తూనే వుంది.

మరోవైపు ఈ ఇద్దరు సూపర్ స్టార్ రాజకీయాల్లోకి ముఖ్యంగా బీజేపీ పార్టీలోకి వస్తే తమ పార్టీ ఎక్కడ అంతమైపోతోందోనన్న భయంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళనల్లో పడిపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆ హీరోలకు రాజకీయాల్లోకి రాకుండా తమదైన శైలిలో వారికి హితువులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రహీరోలైన రజనీకాంత్, కమల్ హాసన్ లు రాజకీయాల్లోకి రావొద్దని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ కోరారు. రాజకీయ కార్యకలాపాల్లో అనవసరంగా బందీ కావొద్దని ఆయన ఆ హీరోలకు సలహాలు ఇస్తున్నారు.

సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడిన ఇళంగోవన్.. ‘‘రాజకీయాల్లోకి రావొద్దని సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లను నేను కోరుతున్నాను’’ అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వార్త ఇప్పుడు తమిళనాడుతోపాటు బీజేపీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఒకవైపు బీజేపీ వాళ్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ రావొద్దని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఈ వ్యాఖ్యలు రెండుపార్టీల వర్గాల మధ్య తీవ్ర ఆందోళనలకు దారితీసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి దీనిపై కమల్, రజనీతోపాటు బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : evks elangovan  kamal hassan  rajnikanth  tamilnadu bjp party  telugu news  

Other Articles