Husband gave divorce his wife for not giving reply to his whatsapp messages

soudi arabia divorce case, whatsapp divorce case, husband divorce wife for not giving whatsapp reply, soudi aribia crime news, husband wife relationship, social media divorce cases, whatsapp divorce cases, facebook news, twitter news

husband gave divorce his wife for not giving reply to his whatsapp messages and not taking care of children and house

విచిత్రం: వాట్సాప్ లో రిప్లై ఇవ్వలేదని భార్యకు విడాకులు

Posted: 11/17/2014 08:23 PM IST
Husband gave divorce his wife for not giving reply to his whatsapp messages

సోషల్ మీడియా కారణంగా విడాకులు తీసుకునే దంపుతులు ఎక్కువైపోతున్నారని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేశాయి. భార్యలు తమతోకాకుండా తమ ఫ్రెండ్స్ తో, ఇతరులతో ఎక్కువగా చాటింగ్ చేస్తున్నారని లేదా అక్రమసంబంధాలు ఏర్పరుచుకుంటున్నారనే అనుమానాలతో భర్తలు తమ భార్యలకు విడాకులు ఇచ్చేస్తున్నారు. ఇలా విడాకులు ఇచ్చుకుంటున్నవారి సంఖ్య అప్పుడే లక్షల్లో చేరిపోయిందని కొంతమంది పరిశోధకులు వెల్లడించారు కూడా! ఇప్పుడీ మాటలకు రుజువుగా తాజాగా మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం తనకు మెసేజ్ కి రిప్లై ఇవ్వడంలేదన్న నెపంతో తన భార్యకు ఏకంగా విడాకులిచ్చేశాడో భర్త!

వివరాల్లోకి వెళ్తే... సౌదీఅరేబియాకు చెందిన 30 ఏళ్ల ఒక వ్యక్తి ఇటీవలే వివాహం చేసుకున్నాడు. మొదట్లో కొన్నాళ్లవరకు ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవుకానీ.. సోషల్ మీడియా వీరిద్దరి మధ్య చిచ్చుపెట్టేసింది. ఇతను తన భార్యను రోజూ సందేశాలు పంపేవాడని.. కానీ తన భార్య అందుకు సమాధానమివ్వకుండా గంటలతరబడి మొబైల్ ఫోన్లో తన స్నేహితులతో, కుటుంబసభ్యులతో మాట్లాడుతుంటుందని పేర్కొంటున్నాడు. మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఇల్లు, పిల్లలను పట్టించుకోవడం లేదని, వాట్సాప్ లో తన సందేశాలు చదివి కూడా రిప్లై ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నాడు.

గంటల తరబడి ఇతరులతో ఫోన్లో చాటింగ్ చేస్తోందని, తన మెసేజ్ చదివి కూడా రిప్లై ఇవ్వడంలేదని ఆగ్రహంతో ఊగిపోయిన అతగాడు... తన సందేశాలకు ఎందుకు రిప్లై ఇవ్వడంలేదని ప్రశ్నిస్తే అందుకు బదులుగా తన స్నేహితులతో, కుటుంబసభ్యులతో మాట్లాడుతూ బిజీగా వున్నట్లు తెలుపుతోందని అతడు పేర్కొన్నాడు. దీంతో భర్త అయిన తననే పట్టించుకోకుండా ఇతరులతోనే ఛాటింగ్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ భర్త ఏకంగా విడాకులు ఇచ్చేశాడు. తనకు ప్రాధాన్యత ఇవ్వని భార్య అవసరం లేదని అతను తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles