Will crop loan waivered in andhrapradesh or not

chandrababu naidu, chandrababu naidu wiki, chandrababu naidu latest, chandrababu naidu photos, chandrababu naidu family, chandrababu naidu comments, andhrapradesh, andhrapradesh government, andhrapradesh news, andhrapradesh map, loans, home loans, loan waiver, crop loans, crop loan waiver, latest news

there is a doubt on loan waiver in andhrapradesh with chandrababu naidu recent statement : chandrababu naidu told recently that rbi not accepting government's decission to waiver crop loan

బాబుగారికి అప్పడే తెలియదా...?

Posted: 10/04/2014 03:45 PM IST
Will crop loan waivered in andhrapradesh or not

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారు. రుణమాఫీ అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం అన్నారు. కాని ఇంతవరకు రుణమాఫీ అమలు కాలేదు. అటు తెలంగాణలో ఎలాగోలా ప్రభుత్వం రుణమాఫికి ఉత్తర్వులు అయితే జారీ చేసింది. కాని ఏపీ విషయంలో ఆ పరిస్థితి లేదు. విభజన తర్వాత ఏపీకి అప్పులు మిగిలితే... రైతుల అప్పులు అదనపు భారంగా మారాయి. ఆదుకుంటుంది అనుకున్న పెద్ద బ్యాంకు ఆర్బీఐ రుణమాఫీ ఎందుకివ్వాలి? అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. ఇచ్చినమాటకు కట్టుబడి ఎలాగైనా రుణమాఫీ చేయాలని చంద్రబాబు కేబినెట్ పట్టుదలతో ఉంది.

రాష్ర్ట విభజన జరుగుతుందని ఎన్నికలకు ఆర్నెల్ల ముందుగానే అందరికి తెలుసు. మరి అప్పటికి ఏపీకి ఎన్ని ఆస్తుులు, ఎంత మేర అప్పులు ఉన్నాయో చూసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపై అప్పటికి ఇంకా స్పష్టత కూడా రాకముందే ఏపీలో అధికారంలోకి వస్తే రూ.లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు కాని అందుకు కావాల్సిన డబ్బులు ఎవరు ఇస్తారు? ఎక్కడినుంచి తెస్తారు అనుకున్నారు అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆర్బీఐ నుంచే డబ్బులు తీసుకురావాలి అనుకుంటే ముందే ఈ ప్రతిపాదనకు అనుమతి ఇస్తారా? లేదా? అనే విషయం తెలుసుకోవాల్సింది. కాని అలా చేయకుండా హామిని ప్రకటించి ఇప్పుడెలా  చేయాలి అని తలలు పట్టుకుంటున్నారు.

రుణమాఫీ హామి కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లుగా ఉందని విమర్శలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ చాణిక్యుడు వేసిన ఎత్తుగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాని ఇదే ఎత్తులో బాబుగారు ఎరక్కపోయి ఇరుక్కున్నట్లుగా అయిపోయారు. హామి ప్రకటించారు బాగానే ఉంది. రిజర్వు బ్యాంకు సహకరించటం లేదు. అలాగని చెప్తే రైతులు ఊరుకోరు. ప్రతిపక్షం ఈ వ్యవహారంపై ఇప్పటికే దుమ్మెత్తిపోస్తుంది. దీంతో చివరకు ప్రభుత్వం సెక్యుురిటి బాండ్లు ఇచ్చి అయినా రుణమాఫీ చేస్తుందని మంత్రులు చెప్తున్నారు.

ఇన్ని ఇబ్బందులు పడి.., ఇంతగా విమర్శలు ఎదుర్కుని చివరకు ప్రభుత్వానికి మరింత అప్పులు మిగులుస్తూ రుణ మాఫి చేయటం అవసరమా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రైతులను ఆదుకోవద్దు అనేది వారి ఉద్దేశ్యం కాదు. రుణమాఫి అంటే కేవలం రైతులు తీసుకున్న లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తారంతే. అదే లక్ష రూపాయలు చొప్పున రైతుల కోసం నాణ్యమైన విత్తనాలు ఇఛ్చి.., మంచి పంటలు వేయించి ప్రభుత్వమే చివరకు పంట ఉత్పత్తిని కొంటే నిజంగా ఆదుకున్నవారవుతారు. కాని ఇలా లక్ష రూపాయలు ఇచ్చుకుంటూ పోతే రైతులకు అప్పు కట్టుకూడదు అనే భావన పెరుగుతుంది తప్ప మరొకటి ఉండదు. దీర్ఘకాలిక ప్రయోజనాలు, దూరదృష్టితో నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇలా రాజకీయ అవసరాల కోసం హామిలు ప్రకటించి ఇబ్బంది పడటం  సరికాదు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhrapradesh  chandrababu naidu  loan waiver  latest news  

Other Articles