Bv raghavulu fires on ap government

raghavulu, bv raghavulu, raghavulu comments on telangana, raghavulu on andhrapradesh, raghavulu on chandrabu naidu, latest news, andhrapradesh, ntr sujala sravanthi, ntr sujala sravanti, andhrapradesh government programmes, government schemes, water supply, water purification, raral water schemes

cpm leader bv raghavulu criticises government new programme ntr sujala sravanthi says its benificier to multi national companies only : andhrapradesh government programmes are only to satisfy mnc and b

కరెంటుపై కట్టుకధలు.. పధకాలు ప్రైవేటుకా

Posted: 10/04/2014 01:57 PM IST
Bv raghavulu fires on ap government

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సీపీఎం నేత రాఘవులు మండిపడ్డారు. బాబు ప్రవేశపెట్టిన పధకాలపై విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పధకంపై రాఘవులు విమర్శలు చేశారు. సుజల స్రవంతి పధకం కేవలం మల్టినేషనల్ కంపనీలను బాగుపర్చేందుకే అని ద్వజమెత్తారు. ఆరోగ్యం, విద్య ప్రైవేటుపరం అయినట్లే ఇప్పుడు నీళ్ళు కూడా ప్రయివేటుచేతుల్లోకి వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో శనివారం రాఘవులు మాట్లాడారు. భవిష్యత్తులో నీటి కోసం ప్రయివేటు కంపనీల దగ్గర మోకరిల్లే దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పధకంప్రమాదకరంగా మారుతుందన్నారు. ఇలాంటి పధకాలను ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహించటం పట్ల విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరి ప్రజల కంటే ప్రైవేటు రంగానికి మంచి చేస్తుందన్నారు. పధకాలపేరుతో ప్రజలను చంద్రబాబు వంచించటం తప్ప మరొకటి చేయటం లేదన్నారు. ఇక కరెంటు కోసం చెప్పేవన్ని కట్టుకధలు అని విమర్శించారు.

ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఇక జన్మభూమి-మా ఊరు కార్యక్రమం, స్వచ్ఛ భారత్ పేరుతో రోడ్లను ఊడిస్తే సరిపోదన్నారు. విజయవాడ డ్రైనేజిలు క్లీన్ చేస్తే సరిపోదు..,రాష్ట్రంలోని  ప్రభుత్వ పాఠశాలల్లో టాయ్ లెట్లు చూసి వాటిని క్లీన్ చేయాలని సవాల్ విసిరారు. అదేవిధంగా జన్మబూమిలో ప్రభుత్వ పాఠశాలలను భాగస్వాములను చేస్తున్న ప్రభుత్వం.., ప్రైవేటు స్కూళ్ళ విద్యార్థులను ఎందుకు భాగస్వామ్యం చేయటం లేదని ప్రశ్నించారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghavulu  ntr sujala sravathi  latest news  andhrapradesh  

Other Articles