Renuka chowdary response on polavaram

polavaram, polavaram project, polavaram merged villages, bhadrachalam, renuka chowdary, latest news, telangana bill, khammam, telangana, kcr, congress, trs, renuka chaudary

renuka chowdary lately responded on polavaram villages issue : renuka chaudary accuses kcr for merging 7mandals into polavarm but not talks about congress mistakes

పుట్టింటిపై ఆలస్యంగా పుట్టిన ప్రేమ

Posted: 09/05/2014 01:33 PM IST
Renuka chowdary response on polavaram

కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి గురించి తెలియని వారు ఎవరైనా ఉంటారా. ఆమె మాట్లాడితే అలా నిలుచుండిపోవాల్సిందే. అంతటి వాక్చాతుర్యం.., వాక్ధాటి ఉన్న మహిళా నేత ఆమె. ఉన్నట్టుండి ఆమెకు పుట్టింటిపై ప్రేమ పొంగుకొచ్చింది. అదేనండి ఖమ్మం ఆడబిడ్డగా చెప్పుకునే రేణుకకు జిల్లాలో ముంపు మండలాలపై స్పందించింది. విలీనంకు కేంద్రం ఆమోదం తెలిపి.., విభజన చట్టాన్ని సవరించిన ఇన్నాళ్లకు ఆమె ఉద్యమం మొదలు పెట్టింది. ఇన్నాళ్లు కన్పించని ఖమ్మం కూతురుకు సడన్ ఇంత ప్రేమ వచ్చిందేమిటా అని చర్చ జరుగుతోంది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం....  7ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలిపారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపి విభజన చట్టాన్ని కూడా సవరించింది. సవరణ సమయంలో పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా ప్రతిఘటించారు. అటు ముంపు మండలాల ప్రజలు కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేశారు. కాని నిర్ణయం ఆగలేదు. మండలాలను విలీనం చేస్తూ ఉత్తర్వులు కూడా ఎప్పుడో వెలువడ్డాయి. ఇంత జరిగిన తర్వాత ఇన్ని రోజులకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు కొంతమంది ముంపు గ్రామాల ప్రజలు భద్రాచలంలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. పోలవరం కింద ముంపు లేదని.., అయినా సరే అన్యాయంగా మండలాలను ఏపీలోకి చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

అటు ముంపు గ్రామాల విలీనంకు కేసీఆర్ కారణమని కొత్తగా ఆరోపించారు. దీనిపై అంతా అవాక్కయ్యారు. కేసీఆర్ కేంద్రంతో చర్చించి మండలాలను ఏపీకి అప్పగించారా అని గిరిజన ప్రజలు అనుకుంటున్నారు. అయితే విభజన చట్టంలోనే ముంపు మండలాలను ఏపీలో కలపాలని ప్రతిపాదించారు. ఆ సమయంలో సొంత ప్రభుత్వం బిల్లును ఆమోదించేటపుడు రేణుక సైలెంట్ గా ఉంది. పుట్టింటికి అన్యాయం జరిగినా పట్టించుకోలేదు. ఇప్పుడు అంతా అయిపోయాక అయ్యో అన్యాయం జరిగిపోయిందని గిరిజనులను ఓదారుస్తోంది.., వారి పక్షాన నిలిచి ట్రాక్టర్ నడిపి మరీ పోరాటం చేస్తోంది. అదీ రేణుక అక్క అంటే.., ఆమె ఏది చేసినా ఎరైటీ అని లోకల్ కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : polavaram  khammam  renuka chowdary  latest news  

Other Articles