Ap assembly heated up with capital issue

ap new capital, andhrapradesh, capital, shivaramakrishnan committee, hyderabad, tdp, ysr congress, jagan, chandrababu naidu, tdp mla's, ap cabinet list, ysr congress mla's, telangana, latest news, assembly

tdp and ysr congress members in ap assembly quarraled about capital issue : ap capital issue become serious in ap assembly ruling opposition parties faced angry on issue

రాజధానిపై సభలో రభస

Posted: 09/03/2014 01:01 PM IST
Ap assembly heated up with capital issue

రాజధాని వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో రభస జరిగింది. బుధవారం శాసనసభ దద్దరిల్లిపోయింది. అధికార విపక్షాల మద్య పోటాపోపటీ విమర్శలతో గందరగోళం ఏర్పడి ఎలాంటి చర్చ లేకుండానే వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలు తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించి ప్రశ్నోత్తరాలపై చర్చ చేపట్టారు. ఇది జరుగుతుండగానే ఏపీ రాజధానిపై చర్చకు వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే గురువారం ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత ఈ అంశంపై చర్చ జరుగుతుందని వివరణ ఇచ్చారు.

ప్రకటించాక ఏం చర్చిస్తారు? -వైసీపీ

ఈ ప్రకటనపై వైసీపీ సభ్యులు తీవ్రంగా స్పందించారు ప్రకటన చేసిన తర్వాత ఇక చర్చించటానికి ఏముంటుంది. అని నిలదీశారు. ముందు చర్చ జరిపి ఒక నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత ప్రకటించాలి కానీ.., ముందే ప్రకటన చేసి ఇక ఏం మాట్లాడమంటారు అని ప్రశ్నించారు. ఇది వైసీపీ-టీడీపీ సభ్యుల మద్య వాగ్వాదానికి దారి తీసింది. రాజధానిపై ముందుగా చర్చ జరగాలని, ఆ తర్వాతే రాజధానిపై ప్రకటన చేయాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. రాజధానిపై 304 నిబంధన కింద నోటీసు ఇచ్చామని గుర్తు చేశారు. నోటిసుపై ఎప్పుడు చర్చిస్తారో.. ఎంత సమయం ఇస్తారో చెప్పాలని కోరారు. ఈ సమయంలో మళ్లీ రెండు పార్టీల మద్య వాగ్వాదం జరగటంతో సభ పది నిమిషాల పాటు వాయిదా పడింది.

సభ తిరిగి ప్రారంభం అయిన తర్వాత కూడ పరిస్థితిలో మార్పు రాలేదు. రాజధానిపై ముందు చర్చ జరపాల్సిందే అని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. టీడీపీ సభ్యులు కూడా అంతే పట్టుగా వ్యవహరించటంతో సభలో గందరగోళం ఏర్పడింది. చివరకు సభ సజావుగా నడిచే పరిస్థితి లేకపోవటంతో స్పీకర్ కోడెల శివ ప్రసాద్ గురువారంకు వాయిదా వేశారు. గురువారం సభ ప్రారంభం కాగానే ఏపీ రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆ వెంటనే ప్రభుత్వ నిర్ణయంపై చర్చ జరగనుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap capital  assembly  tdp  latest news  

Other Articles