Past life memory to rajasthan boy

Past life memory to Rajasthan boy, Rajasthan boy remembers his past life, Past life hypnotic regression,

Past life memory to Rajasthan boy stuns every one when it is proved

ఉన్నట్టుండి గత జన్మ గుర్తుకొస్తే ?

Posted: 07/22/2014 08:52 AM IST
Past life memory to rajasthan boy

ఫోన్ అదే కానీ సిమ్ కార్డ్ మారినట్లుగా ఎప్పటిలా పొద్దునే లేచిన తర్వాత ఎప్పటిలా ఉండకుండా అప్పటి వరకు ఉన్న నేను అనేది మారిపోతే ఎలా ఉంటుంది.  శరీరం అదే, కానీ నేను ఎవరు అని అంతకుముందు వరకు మీరు అనుకుంటున్నారో అది కాకుండా మీరు మరెవరో అన్న భావన వస్తే మీకు ఎలా ఉంటుంది, మీతో అనుబంధం, సంబంధం ఉన్నవాళ్లకెలా అనిపిస్తుంది.  

"ఏమ్మా ఒంట్లో బావుందా.  'మనం' సినిమా ఎన్నిసార్లు చూసావ్?" అంటారేమో.  ఈ లోపులో అసలు సంగతే చెప్పేస్తా!

అది రాజస్తాన్ లోని అల్వార్.  7 సంవత్సరాల కుర్రవాడు రజనీష్ ఎప్పటిలాగానే పొద్దునే లేచాడు కానీ తనను తాను రజనీష్ గా కాక కేదార్ కుమార్ గా భావించటం మొదలుపెట్టాడు.  తన ఊరు షేర్పూర్ అని చెప్పాడు.  తన భార్యా పిల్లలు అక్కడే ఉన్నారని అన్నాడు.  నిద్ర మగతలో ఏదో అంటున్నాడని కాసేపు కొట్టిపారేసినా, రజనీష్ తను కేదార్ కుమార్ అని మాటిమాటికీ చెప్పటంతో ఆ వార్త గ్రామంలో దావానంలా పాకింది.  ఈ వింతేమిటో చూడటానికి జనం పోగవటం మొదలుపెట్టారు.  ఎవరు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా రజనీష్ మాత్రం తను రజనీష్ కాదని తన భార్యా పిల్లలు మరో గ్రామంలో ఉన్నారని వాళ్ళకోసం వేదన పడటం మొదలుపెట్టాడు.

ఆ అబ్బాయి తండ్రి స్కూల్ టీచర్ షేర్పూర్ లో విచారిస్తే రజనీష్ చెప్తున్నట్లుగా ఆ పేరుగల మహిళ, పిల్లలు ఉన్నారు, ఆమె భర్త పేరు కేదార్ కుమార్ అని తెలిసింది.  దానితో ఆ అబ్బాయి నిజం చెప్తున్నాడని తెలిసింది.  రజనీష్ ని ఆ గ్రామానికి తీసుకెళ్తే తన భార్య అని చెప్తున్నావిడను గుర్తుపట్టి ఆమెతోనే కాకుండా షేర్పూర్ లో ఇంకా కొంతమందిని గుర్తుపట్టి వాళ్ళని పలకరించాడు.

రజనీష్ తన రెండవ సంవత్సరం నుంచే అప్పుడప్పుడూ తన గత జన్మ విశేషాలను చెప్తుంటే ఏదో కుర్ర చేష్టలు, కుర్రతనం మాటలని కొట్టిపారేసామని చెప్పాడు అతని ప్రస్తుతపు తండ్రి.  మళ్ళీ మళ్ళీ చెప్తూ తన మాటలను నమ్మమని, ఆ గ్రామానికి తీసుకెళ్లమని కోరగా చివరకు జూలై 8 న అతని తండ్రి రజనీష్ ని షేర్పూర్ తీసుకెళ్ళాడట.  రజనీష్ స్కూల్లో అతనితోపాటు చదివే తోటి విద్యార్థులు కూడా రజనీష్ తన గత జన్మ గురించి అప్పుడప్పుడూ చెప్తుండేవాడని అన్నారు.

రజనీష్ ఎప్పుడూ పెద్ద మనిషి తరహాలో వ్యవహరించేవాడు కానీ చిన్నపిల్లవాడిలా ఉండేవాడు కాడని, ఆ అబ్బాయి కంటే పెద్దవాళ్లు ముగ్గురున్నా, వాళ్ళందరికంటే ఎక్కువ పరిణితి కనిపించేదని అతని ఈ జన్మలోని తండ్రి గుర్తు చేసుకున్నారు.  

హిందూ మతాన్ని అనుసరించేవాళ్ళు గతజన్మలుంటాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు.  మరణమనేది శరీరానికేనని, ఆత్మ నశించేది కాదని అది ఎన్నో జన్మలు తీసుకుంటుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినదాన్ని పూర్తిగా నమ్ముతారు.  ఆత్మ తను ఆ జన్మలో చేసిన కర్మానుగుణంగా మరుజన్మ తీసుకుంటుందని చెప్తారు. 

वासांसि जीर्णानि यथा विहायनवानि गृहणाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णा-न्यन्यानि संयाति नवानि देही।।

అయితే అది మనుషులు సన్మార్గంలో పెట్టటానికి చెప్పుంటారని కొందరు అనుకుంటారు.  అది కూడా నిజమే కావొచ్చు కానీ, జన్మలనేవి ఉన్నాయని అయితే పాత జన్మలోని జ్ఞాపకాలుంటే ఈ జన్మలో అనుబంధాలు, నేర్చుకునే విషయాలు, జీవన విధానం సంక్లిష్టమై ఎటూ కాకుండా పోతారు కాబట్టి వాళ్ళ సంస్కారాలు మాత్రం ఉంచి వివరాలను చెరిపేస్తుంది జన్మలను కలిగించే ప్రకృతి వ్యవస్థ.  

వైద్య విద్యనభ్యసించి హైద్రాబాద్ నిమ్స్ లో పనిచేసిన డాక్టర్ న్యూటన్ ఎంతో మందిని హిప్నటైజ్ చేసి పాస్ట్ లైఫ్ లోకి తీసుకెళ్ళి, వాళ్ళ మాటలను రికార్డ్ చేసారు.   

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles