India 3 rd in hiv infected people

india 3 rd in hiv infected people, after africa asia and pacific are most hiv infected, unaids report on hiv/aids

India 3 rd in HIV infected people as per UNAIDS report at the end of 2013

హెచ్ఐవిలో భారత్ ది మూడో స్థానం

Posted: 07/18/2014 03:47 PM IST
India 3 rd in hiv infected people

ఒలింపిక్స్ లో లేకపోయినా, ఫిఫాలో భాగమే వహించకపోయినా ప్రపంచంలో ఏదో ఒక దానిలో భారత్ లెక్కలోకి రాకుండా పోతుందా?

హెచ్ఐవి ఎయిడ్స్ లో భారత్ ది ప్రపంచంలో మూడో స్థానమని యుఎన్ నివేదికలో తేలింది.   2013 సంవత్సరాంతానికి భారత్ లో 2.1 మిలియన్ మనుషులకు ఎయిడ్స్ ఉందట.  ఆసియా, ఫసిఫిక్ ఖండాల్లో ప్రతి 10 మందిలో నలుగురికి ఎయిడ్స్ ఉన్నట్లుగా చెప్తోందా నివేదిక.  ఆఫ్రికా తర్వాత ఆసియా ఫసిఫిక్ ఖండాల్లోనే ఎయిడ్స్ వ్యాధి ముమ్మరంగా ఉందని చెప్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్ల హెచ్ఐవి ఎయిడ్స్ రోగులలో 19 మిలియన్ రోగులకు తమకా వ్యాధి ఉన్నట్లు కూడా తెలియదట.   అందువలన 2030 నాటికల్లా ఎయిడ్స్ రహిత మానవ ప్రపంచాన్ని స్థాపిద్దామనుకుంటున్న యుఎన్ ఎయిడ్స్ సంస్థకు మరింత పని చెయ్యవలసివుంటుందంటున్నారు.

హెచ్ ఐ వి తో సహజీవనం చేస్తూ కాలం గడుపుతున్నవారిలో ప్రపంచం మొత్తం మీద చూస్తే ఈ ఆరు దేశాల్లోనే 90 శాతం ఉన్నారట.  అవి చైనా, భారతదేశం, ఇండోనేషియా, మయన్మార్, థాయ్ లాండ్, వియత్నాం దేశాలు .

భారతదేశంలో ఎయిడ్స్ కి యాంటీ రిట్రోవైరల్ థెరపీ అందుబాటులో లేనివారి శాతం 64 అట.  అయితే 2005-2013 వరక చూస్తే, హెచ్ ఐవి కి వైద్య చికిత్స అభివృద్ధి చెందిందని, ఆ కాలంలో భారత్ లో ఎయిడ్స్ వలన చనిపోయినవారి సంఖ్య ఆసియా పసిఫిక్ ఖండాలలో 38 శాతం తగ్గిందంటున్నారు.  2013 లో భారత్ లో 7 లక్షల మంది ఎయిడ్స్ రోగులు యాంటీ రిట్రో వైరల్ చికిత్సలో ఉన్నారట.  అది ప్రపంచ దేశాలలోని వారితో పోలిస్తే రెండవ స్థానంలో ఉందట.  

భారత దేశంలో వ్యభిచార గృహాల్లో ఉన్న 868000 మహిళలలో 2.7 శాతం మందికి హెచ్ఐవి పాజిటివ్ ఉందట.  గ్రామాల్లోంచి పట్టణాలకు వలస వచ్చినవారిలో చాలా మందికి ఎయిడ్స్ సోకిందట.  

ఎయిడ్స్ సోకిందని తెలిసినవాళ్ళకి తెలియని వాళ్ళకి మధ్య ఉన్న తేడా తగ్గిపోవాలని కూడా యుఎన్ ఎయిడ్స్ అంటోంది.  2020 వరకల్లా ఆ పని జరిగితే 2030 నాటికి ఎయిడ్స్ ని సంపూర్ణంగా లేకుండా చెయ్యవచ్చంటున్నారు   అందరికీ సమానమైన అవకాశాలుండాలన్నదానికి చట్టబద్ధత వచ్చినట్లయితే బాధితులు వారికున్న వ్యాధిని బయటకు చెప్పటానికి వీలవుతుందని తద్వారా వాళ్ళకి చికిత్స కూడా చెయ్యటానికి అవకాశం పెరుగుతుందని చెప్తున్నారు.  హెచ్ఐవి రోగులలో చనిపోయిన వాళ్ళల్లో ఎక్కువ మంది టిబి సోకినవారేనని కూడా నివేదిక తెలియజేస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles