Arundhati roy denies gandhi be called as father of the nation

Arudhati Roy denies Gandhi be called as Father of the Nation, Arundhati Roy comments on Mahatma Gandhi, Arundhati Roy calls Gandhi as casteiest

Arundhati Roy denies Gandhi be called as Father of the Nation

మహాత్మా గాంధీని జాతిపితగా ఒప్పుకోను- అరుంధతి రాయ్

Posted: 07/18/2014 01:14 PM IST
Arundhati roy denies gandhi be called as father of the nation

బుకర్ అవార్డ్ గ్రహీత అరుంధతీ రాయ్ ఇంతకు ముందే మహాత్మా గాంధీకి కులతత్వం ఉండేదని వ్యాఖ్యానించారు.  ఆమె తాజాగా గురువారం నాడు కేరళ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ ఆయనను జాతిపితగా ఒప్పుకోనని కూడా ప్రకటించారు.

1936 లో ప్రచురించిన ది ఐడియల్ భంగి అనే పుస్తకంలోని వ్యాసంలో రాసిన ఒక మాటను ఆధారంగా తీసుకుని అరుంధతి రాయ్ గాంధీని కులతత్వవాదిగా చెప్పుకొచ్చారు.  అందులో, పాకీ పని చేసేవారు మలమూత్రాలను ఎరువులుగా మార్చమని కోరటాన్ని ఆయన కులవివక్షను చాటుతోందని ఆమె అన్నారు.  

హరిజనుల పట్ల ఆయనకున్న చిన్నచూపు వలన గాంధీని జాతిపితగా ఒప్పుకోనని ఆమె అనటమే కాకుండా ఆ పేరుతో ఉన్న విద్యాలయాల పేర్లను కూడా మార్చివేయాలని అన్నారు.  

ఈ వాదన చూస్తుంటే ఒక జోక్ గుర్తుకొస్తుంది.  గాంధీ హింసావాది అని ఒకతను వాదించాట్ట.  అసలు ఈకాలంలో అహింసను బోధించించే ఆయనకదా అని అందరూ ఆశ్చర్యపోతే అతగాడు గాంధీ హింసావాది అనటానికి రుజువుగా ఆయన చేతిలో కర్ర ఉంటుందని చెప్పాడట.  అరుంధతి రాయ్ తీసుకున్న కారణం అంతకంటే ఎక్కువేమీ కాదంటున్నారు విమర్శకులు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles