Ghmc demolitions only in tdp bjp represented areas

GHMC Demolitions only in TDP BJP represented areas, GHMC demolitions reached 44 in Hyderabad, MIM led old city may not be touched by GHMC

GHMC Demolitions in only in TDP and BJP represented areas

గ్రేటర్ కూల్చివేతల్లో ఇది కాకతాళీయమా?

Posted: 07/18/2014 12:10 PM IST
Ghmc demolitions only in tdp bjp represented areas

గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు జిహెచ్ఎమ్ సి అక్రమ నిర్మాణాలను గుర్తించి భారీగా వాటిని కూల్చివేసే పనిలో పడింది.  

ఇంతవరకు 44 భవనాలు కూల్చివేయగా అవన్నీ తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాలవటం కేవలం కాకతాళీయమా లేక కక్ష సాధింపు చర్యా అన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో.  ఈ విషయంలో ఆందోళన చేస్తూ ఆ పార్టీల కార్పరేటర్లు జిహెచ్ ఎంసి ప్రధాన కార్యాలయంలో ధర్నాలు, ఘెరావ్ లు చేసారు.  అయితే, స్టాండింగ్ కమిటీ సిఫారసులు ఏమైనా కానీ ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటానని కమిషనర్ తేల్చి చెప్పారు.  

తెలంగాణా రాష్ట్ర సమితి ప్రాతినిధ్యం ఉన్న చోట కూల్చివేతలు లేకపోవటం, పాత బస్తీ వైపు కన్నెత్తైనా చూడకపోవటం, ఎదిరించలేని ప్రాంత జనాల ఆవాసాలను మాత్రమే కూల్చివేతలకు గురిచెయ్యటం కేవలం కాకతాళీయమా లేకపోతే ఇతర పార్టీల ఆరోపణలను నిజమా అన్నది తెలియటానికి ఇంకా సమయం ఉంది.   ఎందుకంటే గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో మొత్తం 900 అక్రమ నిర్మాణాలను గుర్తించామని జిహెచ్ఎంసి చెప్తోంది- ఏ ప్రాతిపదికన అవి అక్రమ నిర్మాణాలయ్యాయో చెప్పకపోయినా.  

పాతబస్తీలోకి పోయి చూస్తే మాత్రం జిహెచ్ఎంసి కి చేతినిండా పని దొరుకుతుందని రాజకీయ వర్గాలలో అందరూ భావిస్తున్నారు.  ఎందుకంటే అక్కడ చాలవరకు అక్కడ నియమాలను ఉల్లంఘించిన కట్టడాలే కనపడతాయి.  కాకపోతే ఆ ధైర్యం చేసి కెసిఆర్ ప్రభుత్వం తన చిత్త శుద్ధిని చాటుతుందా అన్నది అనుమానమేనని కూడా అంటున్నారు వాళ్ళు.  ఎందుకంటే అక్కడ ఎమ్ఐఎమ్ ప్రాబల్యం చాలా ఎక్కువ.  ఎమ్ఐఎమ్ తో తెరాస పెట్టుకోదని అని చెప్తున్నారు.

అయితే మొదలైంది ఇప్పుడే, పైగా పని ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలిగా కాబట్టి కూల్చివేతల్లో పై పరిశీలనలు కేవలం కాకతాళీయమా లేక అనుకోని చేసిందా అన్నది నిర్ణయించటానికి ఇంకా సమయం ఉంది!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles