పసిమొగ్గలు.. పాఠాలు నేర్చుకోవటానికి ..గుడి అని బడికి వస్తే.. అక్కడ కామంధులు కాసుకొని కూర్చున్నారు. అల్లారుముద్దుగా ఆట.. పాట పాడే వయసు. చిట్టి చిట్టి మాటలు.. విచిత్రమైన అల్లరి పనులు చేసే ప్రాణమున్న పసిడి బొమ్మలు. పాలుగారే .. పసి హృదయాలపై.. కామంధుల కామక్రీడ. మన పెద్ద నగరం, అందరికి ఆదర్శకమైన సిటిలోనే..ఆరేళ్ల చిన్నారికి రక్షణలేకుండాపోయింది. అసలు విషయం ఏమిటంటే..
బెంగళూరులో ఓ ఆరేళ్ల చిన్నారిపై, సదరు బాలిక చదువుకుంటున్న పాఠశాల సిబ్బంది అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తూర్పు బెంగళూరులోని ఓ టాప్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు అఘాయిత్యానికి పాల్పడ్డ ఇద్దరు జిమ్ ఇన్ స్ట్రక్టర్లను అరెస్ట్ చేశారు.
అయితే పాఠశాలలో పిల్లల భద్రతపై బాధితురాలి తల్లిదండ్రులతో పాటు ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళనలతో ఎట్టకేలకు బయటకు వచ్చిన పాఠశాల కరస్పాండెంట్ పిల్లల భద్రతకు సంబంధించి ఇకపై మెరుగైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాలలోని గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే, జరిగిన ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు పాఠశాల యాజమాన్యం యత్నిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే దాకా పోరాటం సాగిస్తామని బాలిక తండ్రి నీలేశ్ చెప్పారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more