Telangana government siezed filmnagar 20 acres land

telangana government siezed filmnagar 20 acres land, filmnagar latest news, telangana government siezed film nagar lands, hyderabad district collector mk meena, mk meena latest news, kcr latest news, cm kcr siezed film nagar lands

telangana government siezed filmnagar 20 acres land

ఫిలింనగర్ భూములు స్వాధీనం!

Posted: 07/05/2014 11:39 AM IST
Telangana government siezed filmnagar 20 acres land

(Image source from: telangana government siezed filmnagar 20 acres land)

తెలంగాణ అక్రమంగా నిర్మించిన కట్టడాలను, స్వాధీనం చేసుకున్న భూముల సేకరణ విషయాలపై దర్యాప్తు మరింత వేగంగా జరుపుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్ట్ భవనాలపై కన్నెర్ర చేసిన కేసీఆర్ ప్రభుత్వం... ఇప్పుడు తాజాగా ఫిలింనగర్ లో చలనచిత్ర అభివృద్ధి సంస్థ అయిన ఎప్ డీసీకి గట్టి షాకిచ్చింది. ఈ సంస్థకు కేటాయించిన 16.48 ఎకరాల భూమిని తెలంగాణ సర్కారు వెనక్కు తీసుకుంది.

చలనచిత్ర అభివృద్ధి కోసం మూడు దశాబ్దాల కిందట భూమి కేటాయించినా.. దానిని ఉపయోగించుకోకుండా అలాగే ఖాళీగా వదిలేయడంతో తెలంగాణ సర్కార్ ఎఫ్ డీసీకి షాకిస్తూ ఆ భూముల్ని వెనక్కు తీసుకుంది. ఇందుకు సంబంధించి శుక్రవారంరోజు సీసీఎల్ఏ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరో నాలుగు ఎకరాల్లో వున్న ఆక్రమణలను తొలగించాలని వారికి ఆదేశాలిచ్చారు.

దీనిపై స్పందించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకే మీనా.... తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలతో క్షేత్రస్థాయి సిబ్బంది రంగంలోకి దిగింది. ఎఫ్ డీసీకి కేటాయించిన భూముల చుట్టూ ‘‘ఈ స్థలం ప్రభుత్వానిది’’ అని బోర్డులు కూడా వేయించిపారేశారు. ఎఫ్ డీసీ నుంచి వెనక్కు తీసుకున్న 16 ఎరకాల భూమిలో 3 ఎకరాలను ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇవ్వాలని వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటికే నిర్ణయించారు.

గతంలో మద్రాసులో వున్న తెలుగు చలనచిత్రపరిశ్రమను హైదరాబాదుకు రప్పించడం కోసం... అప్పటి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు చేస్తూ.. భూములను కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఎఫ్ డీసీ సంస్థకు ఫిలింనగర్ లో వున్న 50 ఎకరాల భూమిని కేటాయించింది. అప్పట్లో ఎకరాకు కేవలం 8,500 రూపాయలు మాత్రమే వసూలు చేశారు. ఈ 50 ఎకరాల్లో 9.5 ఎకరాలు పద్మాలయ స్టూడియోస్ కు, 5 ఎకరాలు సురేష్ ప్రొడక్షన్స్ కు, 5 ఎకరాలు ఆనంద్ సినీ సర్వీసెస్ కు, మరో 10 ఎకరాల భూమిని హౌసింగ్ బోర్డుకు కేటాయించారు.

ఇక మిగిలిన 20 ఎకరాల భూమిని అలాగే ఖాళీగా వుంచేసింది. దీనిపై 2013లో హైదరాబాద్ జిల్లా యంత్రాంగం ‘‘మిగిలిన 20 ఎకరాల భూమిని రక్షించుకుంటారా? లేక మేం స్వాధీనం చేసుకోవాలా’’ అంటూ నోటీసులు కూడా ఇచ్చింది. అయినా ఎఫ్ డీసీ అధికారులు ఆ నోటీసులను అస్సలు పట్టించుకోలేదు. తరువాత ఏడాది కిందట ల్యాండ్ ఆడిట్ చేయడంతో ఎప్ డీసీ నిర్వాకం బయటపడింది. దాంతో ఎఫ్ డీసీకి కేటాయించిన భూములను రద్దు చేసి, వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిందిగా అనుమతించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకే మీనా జూన్ నెలలో 21, 27వ తేదీల్లో సీసీఎల్ఏకు లేఖ రాశారు.

ఈ లేఖను పరిశీలించిన అనంతరం బుధవారం ల్యాండ్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఎల్ఎంఏ) సమావేశంలో భూములను స్వాధీనం పర్చుకునే విషయం గురించి చర్చలు కొనసాగించారు. అనంతరం భూములను వెనక్కు తీసుకోవాలని కలెక్టర్ కు సిఫారసు చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles