Pawan most searched celebrity in google

Pawan most searched celebrity, Aam Aadmi Party, AAP, Andhra Pradesh, Chiranjeevi, Elections 2014, Google, Gul Panag, Hema Malini, JanSena, Jaya Prada, Kirron Kher, Kumar Vishwas, Manoj Tiwari, Pawan Kalyan, Rakhi Sawant

Pawan Kalyan, brother of actor-turned-politician Chiranjeevi, has topped the list of celebrity candidates searched on Google.

పవన్ కోసం తెగ వెతికేస్తున్నారు

Posted: 04/17/2014 05:07 PM IST
Pawan most searched celebrity in google

టాలీవుడ్ లో మామూలుగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే పవన్ కళ్యాణ్ గత కొంత కాలం క్రితం ‘జనసేన ’ పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన ఈయన ఇప్పుడు ఇంటర్నెట్ లో అందరి సినీ సెలబ్రెటీల్లో కన్నా ముందు వరుసలో నిలిచాడు. ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ లో ఎక్కువ శాతం మంది పవన్ పేరునే వెతుకున్నట్లు గూగుల్ ప్రతినిధులు తెలిపారు.

ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో చాలా మంది సెలబ్రెటీలు పోటీలో ఉన్నా, ఎక్కువ మంది పవన్ పేరునే వెతుకుతున్నారని తెలిపారు. గతంలో వివిధ పార్టీల తరుపున ప్రచారం చేస్తున్న అభ్యర్థుల హవా ఉండేదని, ప్రస్తుతం చాలా మంది సెలబ్రెటీలు రాజకీయాల్లోకి రావడంతో వారి గురించి సెర్చ్ చేస్తున్నారని ఆ సంస్ధ ప్రతినిధులు వెల్లడించారు.

ఉత్తర ప్రదేశ్ మీరట్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి నగ్మాను, మధుర నుండి భాజాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న హేమ మాలిని కన్నా పవన్ నే ఎక్కువ మంది వెతికారని తెలిపారు. రాష్ట్రీయ ఆమ్ పార్టీ స్థాపించి ముంబై నుండి పోటీ చేస్తున్న రాఖీ సావంత్ 7వ స్థానంలో నిలవగా, ఆర్ ఎల్ ఢీ నుండి పోటీ చేస్తున్న జయప్రద , చంఢీగడ్ అభ్యర్థులు గుల్ పనాగ్, కిరణ్ ఖేర్ లు సైతం మోస్ట్ సెర్చెడ్ జాబితాలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles