Human bombs held at gorakhpur

Human bombs held at Gorakhpur, BJP Narendra Modi, Indian Mujahideen, Tehsin Akhtar, Human bombs for Modi rally, Anti Terrorist Squad of India, Delhi Crime Branch

Human bombs held at Gorakhpur

మోదీ సభకు రెండు మానవబాంబులు తయారు

Posted: 03/27/2014 10:55 AM IST
Human bombs held at gorakhpur

ఉగ్రావాద వ్యతిరేక దళం ఉత్తర ప్రదేశ్ లో బుధవారం రాత్రి రెండు మానవ బాంబులను పట్టుకోవటం జరిగింది.  వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ సభలో ఆత్మాహుతికి తలపడ్డారని తెలిసింది. 

గోరఖ్ పూర్ పట్టణంలో పట్టుబడ్డ వాళ్ళిద్దరి దగ్గర్నుంచి ఒక ఏకె 47, కొన్ని పిస్టల్స్, వాటి బుల్లెట్లు లభించాయి.  ఈ రోజు వాళ్ళిద్దరినీ కోర్టులో హాజరుపరచనున్నారు. 

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ నాయకులతో పాటు నరేంద్ర మోదీని కూడా లక్ష్యం చేసుకుని చేస్తున్న ఉగ్రవాద చర్యగా తెలుస్తోంది.  పట్టుబడ్డ ఇద్దరు ఉగ్రవాదులు బర్కత్, ముజమ్మిల్ లు పాకిస్తాన్ పౌరసత్వం కలవాళ్ళు.  వీళ్ళని లోకసభ ఎన్నికలలో నాయకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలు చెయ్యటానికి పంపించినట్లుగా తెలుస్తోంది. 

పాకిస్తాన్ లో ముల్తాన్ లో పౌరసత్వం కలిగిన వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేసినట్టుగా ఏటిఎస్ ఇన్ స్పెక్టర్ జనరల్ ధృవీకరించారు కానీ వాళ్ళ గురించి వివరాలేమీ తెలియజేయలేదు. 

ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ తెహ్సీన్ అఖ్తర్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ క్రైం బ్రాంచ్ ఇచ్చిన సమాచారంతో గోరఖ్ పూర్ లో అనుమానస్పదంగా వ్యవహరించిన మానవ బాంబు దళంలోని ఇద్దరినీ పట్టుకున్నారని తెలిసింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles