Stakes in the 2014 elections in crores

Stakes 2014 elections in crores of Rupees, 2014 general elections, cash transport in elections, AP state high in cash held by EC

Stakes in the 2014 elections only in crores of Rupees

కలవారికి ఎన్నికలు, సామాన్యుడికి కలలు! లెక్కలన్నీ కోట్లలోనే

Posted: 03/27/2014 09:21 AM IST
Stakes in the 2014 elections in crores

ఎన్నికలు సజావుగా సాగటం కోసం పనిచేసే ఎన్నికల కమిషన్ ఆ దిశగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు కొత్త నియమాలు, నిఘాలతో కట్టుదిట్టం చేస్తున్నా, ఎన్నికల కమిషన్ కి అన్నిటికన్నా పెద్ద సవాల్ నోటు రాజకీయమే.  ఈ విషయాన్ని ఎన్నికల కమిషనర్ హరి శంకర్ బ్రహ్మ బుధవారం నాడు ఎంతో ఆవేదనతో తెలియజేసారు. 

సొమ్ము రవాణాలో ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం.  ఇంతవరకు తరలిస్తున్న డబ్బు పట్టుబడింది 80 కోట్లైతే, అందులో మనరాష్ట్రంలోనే 49.5 కోట్ల రూపాయలు. 

ఎన్నికల కమిషన్ ఈ సారి అభ్యర్థుల చేసే గరిష్ట ఎన్నికల ఖర్చుని పెంచుతూ 70 లక్షలు చేస్తే అది కూడా సరిపోదని తమదగ్గర వాపోతున్నారని ఇసి అన్నారు.  కనీసం 3 కోట్లైనా అవసరం పడుతుందని అభ్యర్థులు కొందరు సూచించారట.  ఎన్నికలలో గెలవటానికి 35 కోట్లు ఖర్చుపెట్టటానికి ఒక నాయకుడు సిద్ధమౌతే, అంతకు మించి 100 కోట్లు పెట్టటానికి మరో అభ్యర్థి తయారయ్యారని సాక్షాత్తూ ఇసి చెప్పటం విశేషం. 

ఎన్నికలలో డబ్బు కీలక పాత్రను వహించటమంటే ఎన్నికలు సజావుగా సాగనట్లే, వోటర్లను ప్రలోభానికి పడేసినట్లే.  ఇవన్నీ పక్కకు పెడితే అసలు అంత ఖర్చు పెట్టటానికి ఎందుకు తయారవుతున్నారు.  అంతకంత తిరిగి సంపాదించటానికే అన్నది తేటతెల్లంగా తెలుస్తూనేవుంది.  అది కూడా ఐదు సంవత్సరాల కాలంలో కాదు- ఏ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో, ఎవరికి ఎంత కాలం అధికారం ఉంటుందో తెలియదు కాబట్టి సాధ్యమైనంత త్వరగానే తమ సొమ్మును లాభంతో సహా రాబట్టుకోవటానికే చూస్తారనటంలో సందేహం లేదు. 

అంటే ఇది పూర్తిగా డబ్బులున్నవారి ఆటే.  ఎన్నికల సమయంలో నాయకులకు సామాన్యుడు మాన్యుడే కానీ అసలు గేమ్ వేరే వుంది.  కేవలం వోటర్లు పావులే.  గెలుపు ఓటమిలతో వారికి ఎటువంటి సంబంధమూ ఉండదన్నిది అర్థమౌతోంది.

ఇంతకీ ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎంతంటే సాధారణ ఎన్నికలకు 5 వేల కోట్లు, నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు వెయ్య కోట్ల రూపాయలట. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles