Wild fire in seven hills

Wild fire in Seven Hills, Seshadri hill under fire, Tirumal Tirupati, loss to rare trees in fire, Loss to wild life in forest fire

Wild fire in Seven Hills, Seshadri hill under fire, Tirumal Tirupati

తిరుమల కొండలలో అగ్ని కీలలు

Posted: 03/19/2014 10:57 AM IST
Wild fire in seven hills

తిరుపతి సమీపంలోని మంగళం దగ్గర అంటుకున్న మంటలు వాటిని ఎవరూ పట్టించుకోకపోవటంతో క్రమంగా వ్యాపిస్తూ ఏడుకొండలకు ఎగబాకాయి.  శేషాచలం అడవులలో ప్రస్తుతం మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. 

వేల హెక్టార్లలో జరిగిన ఈ ప్రమాదంలో జంతు నష్టం, అరుదైన వృక్ష జాతుల నష్టం కలిగింది.  అటవీ సంపదకు జరుగుతున్న భారీ నష్టాన్ని తగ్గించటానికి రెండు అగ్ని మాపక శకటాలతో ట్యాంకర్లతో ప్రయత్నం చేస్తున్నారు. 

ఎక్కువగా వేసవిలో అడవిలో మంటలు అంటుకుంటూవుంటాయి.  వాటిని అదుపు చెయ్యటం కష్టసాధ్యమైన పని.  నగరాల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడే అక్కడి చేరుకోవటంలో ఆలస్యమవుతుంది, ఎంతో నష్టం జరుగుతుంటుంది.  అలాంటిది అడవుల్లో మంటలను ఎవరు అదుపుచేస్తారు.  పైగా ఎండుటాకులు పడి వుంటాయి కాబట్టి చిన్న నిప్పు రవ్వ కూడా భారీ అగ్ని ప్రమాదానికి దారితీయవచ్చు.  వీచే గాలులు ఆ మంటలకు ఇంకా ఊపిరి పోస్తాయి.  అందుకే దాన్ని వైల్డ్ ఫైర్ అంటారు.  మంటలు ఎటువైపు వ్యాపిస్తాయో చెప్పటం కష్టమౌతుంది.  అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఆగిపోవటమో లేకపోతే సహజంగా ప్రకృతి వర్షించి దాన్ని నిలిపివేయటమో జరగవలసిందే కానీ దాన్ని అదుపులోకి తేవటానికి మనదగ్గర ఎటువంటి ఏర్పాట్లూ లేవు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles