Konda couple join trs

Konda couple join TRS, TRS party leader Vidyasagar attempts suicide, Konda Surekha, Konda Murali, TRS Chief KCR, Warangal East to Kondas, Bhupalapalli ticket to Kondas

Konda couple join TRS, TRS party leader Vidyasagar attempts suicide, Konda Surekha, Konda Murali, TRS Chief KCR, Warangal East to Kondas, Bhupalapalli ticket to Kondas

తెరాసలో కొండా దంపతుల చేరిక, విద్యాసాగర్ అఘాయిత్యం

Posted: 03/19/2014 10:26 AM IST
Konda couple join trs

వరంగల్ లో రాజకీయంగా బలమైన సమర్ధనగల కొండా మురళి, కొండా సురేఖలను కాంగ్రెస్ లో చేర్చుకోవటానికి టి పిసిసి తీవ్రమైన కృషి చేసినా చివరకు వాళ్ళని తెలంగాణా రాష్ట్ర సమితిలో చేర్చుకోవటంలో కెసిఆర్ కృతకృత్యులయ్యారు. 

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొండా సురేఖ, ఎమ్మెల్సీగా చేసిన కొండా మురళి చేరిక తెరాసకు బలం చేకూరుస్తుందనటంలో అనుమానం లేదు.  పార్టీలో చేరటానికి ముందు కొండా దంపతులు తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.  వాళ్ళకి తూర్పు వరంగల్, భూపాలపల్లి నియోజకవర్గాలలో టికెట్ ఇస్తానని కెసిఆర్ మాటిచ్చినట్లుగా తెలుస్తోంది. 

నవ తెలంగాణా నిర్మాణం చెయ్యగల యోగ్యత, బడుగు వర్గాల అభివృద్ధికి పాటుపడగల సంకల్పం ఒక్క తెలంగాణా రాష్ట్ర సమితి మాత్రమే ఉన్నాయని, అందువలన ఆ పార్టీలో చేరుతున్నామని కొండా సురేఖ అన్నారు. 

అయితే, వాళ్ళు వైయస్ ఆర్ కాంగ్రెస్ లో ఉన్న సమయంలో తెరాసతో చాలా విభేదిస్తూ ఉండేవారు, వాళ్ళ మీద వ్యాఖ్యానాలు చేస్తుండేవారు.  కానీ అవి కేవలం సైద్ధాంతికమైన విభేదాలని కొండా సురేఖ అంటే, పాత సంఘటనలను మర్చి పోయి ఇప్పుడు తెలంగాణా అభివృద్ధికి పాటుపడటం మాత్రమే చెయ్యదగ్గదని కెసిఆర్ కుమారుడు కెటిఆర్ అన్నారు. 

ఇది ఇలా ఉండగా ఈ సంగతి తెలిసిన వరంగల్ లో పార్టీ ఇన్ ఛార్జ్ విద్యాసాగరరావు తన మద్దతుదారులతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చి, బయటి వాళ్ళకి పార్టీ టికెట్ ఇవ్వటం మీద నిరసన వ్యక్తం చెయ్యటమే కాకుండా తన వంటిమీద కిరోసిన్ పోసుకున్న ఆత్మాహుతికి పాల్పడ్డారు.  ఆయన పిలవగా అక్కడ హాజరైన ఆయన మద్దతుదారులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh