Last recorded words from missing malaysian plane

last recorded words from missing Malaysian plane, Alright Good Night last words of Malaysian plane, Pilots of missing Malaysian plane

last recorded words from missing Malaysian plane

ఆల్ రైట్ గుడ్ నైట్- గల్లంతైన విమానంలోని ఆఖరి మాటలు

Posted: 03/17/2014 10:46 AM IST
Last recorded words from missing malaysian plane

మార్చ్ 8 న కౌలాలంపూర్ లో బయలుదేరిన మలేషియన్ పౌర విమాన సంస్థ విమాన సేవ ఎమ్ హెచ్ 370 ఉదయానికి నిర్దేశిత చైనాలోని బీజింగ్ కి చేరలేదు, ఇంతవరకు దాని ఆచూకీ కూడా తెలియలేదు.  సముద్రంలో పడిపోయిందని, విమానం దిశ మారిందని, నకిలీ పాస్ పోర్ట్ లతో ఆ విమానంలో ఎక్కినవాళ్ళు ఉగ్రవాద చర్యగా విమానాన్ని అపహరంచి ఉండవచ్చునని రకరకాలుగా ఆలోచిస్తూ, అన్ని కోణాలలోనూ దర్యాప్తులు, గాలింపులు జరుగుతున్నా నిర్దిష్టమైన సమాచారం ఇంతవరకు అందలేదు.  అందులో ప్రయాణిస్తున్న 239 మంది ప్రయాణీకులు, విమాన సిబ్బందిలో ఎవరి దగ్గర్నుంచీ ఎటువంటి సమాచారమూ రాలేదు. 

అపహరణకు ముందుగా ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్ ని ఆఫ్ చేసి ఉంటారని అనుమానం కలుగుతోంది.  ఆఖరు సారిగా విమానంలోని సమాచార వ్యవస్థ తెగే ముందుగా రికార్డ్ అయిన మాటలు, ఆల్ రైట్, గుడ్ నైట్ అని.  ఆ మాటలు పూర్తై సైన్ ఆఫ్ చెయ్యటానికి ముందే విమాన స్థితిని గురించిన డేటా ను పంపించే మెయిన్ టెనెన్స్ కంప్యూటర్ ని ఎవరో స్విచ్ ఆఫ్ చేసినట్లుగా తెలుస్తోంది.  ఈ విషయాన్ని ప్రస్తుతం మలేషియాలో రవాణా మంత్రిగా పనిచేస్తున్న హిషాముద్దీన్ హుస్సేన్ తెలియజేసారు. 

విమానం నడుపుతున్న పైలెట్లు, సిబ్బంది చరిత్రలను తవ్వి చూస్తున్నారు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు.  కౌలాలంపూర్ శివార్లలో ఉన్న పైలెట్ల నివాసాలను క్షుణ్ణంగా గాలించారు.  53 సంవత్సరాల వయసున్న జహారీ అహ్మద్ షా, 27 సంవత్సరాల ఫారిక్ అబ్దుల్ హమీద్ లు కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రమానికి దగ్గర్లో ఉన్న మధ్యతరగతి కుటుంబ నివాసాలుండే కాలనీలో ఉంటున్నారు.  అయితే ఈ విషయంలో అనవసరమైన ఊహాగానాలు వద్దని దర్యాప్తు చేసే వాళ్ళని చెయ్యనీయమని జహారీ తో సన్నిహితంగా ఉండే పైలట్ అన్నారు.  జహారీ ఆత్మాహుతికి పాల్పడే వాడు, రాజకీయాలతో సంబంధమున్నవాడు కాదని ఆయన అన్నారు.  అంతేకాకుండా అతనితోపాటు కో పైలట్ గా వెళ్ళిన ఫారిక్ అబ్దుల్ హమీద్ ని అధికారులు పంపించారు కానీ, వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చెయ్యటానికి అధికారులను వాళ్ళిద్దరిలో ఎవరూ అడగలేదని కూడా అన్నారు. 

దర్యప్తులో సహకరించవలసిందిగా మలేషియన్ ప్రభుత్వం 22 దేశాల దౌత్యాధికారులను అర్థించింది.  

ఇంతవరకూ ఆచూకీ తెలియని విమానం విషయంలో ఏ వివరాలు తెలియని ప్రయాణీకులు, సిబ్బందిల కుటుంబ సభ్యులు ఎవరు బాధ్యులు, ఎవరు సరైన సమాధానం చెప్తారంటూ వేదనతో అడుగుతున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh