Pawan kalyan speech on sachin and bhagat singh

pawan kalyan, pawan kalyan into politics, jana sena, pawan political entry, tollywood hero in politics, novotel, pawan kalyan, pawan kalyan political party launch, pawan kalyan speech, pawan kalyan jana sena party launch, Telangana Jagruthi president Kavitha, KCR, Rahul Gandhi, Trivikram Srinivas, Chiranjeevi, sachin and bhagat singh

pawan-kalyan speech-on sachin and bhagat singh

సచిన్ తో పోలికతో-భగత్ సింగ్ స్పూర్తితో ముందుకెళతా?

Posted: 03/14/2014 09:45 PM IST
Pawan kalyan speech on sachin and bhagat singh

 భగత్ సింగ్ ఆత్మ బలిదానం జరిగి చాలా కాలం అయ్యిందని, కానీ భగత్ సింగ్ మరణం తనను కదిలించిందనీ పవన్ కల్యాణ్ చెప్పారు. భగత్ సింగ్ డైరీలను చదివినప్పుడు తాను స్ఫూర్తి పొందానని పవన్ తెలిపారు.

చిన్న వయస్సులోనే భగత్ సింగ్ మరణించినా, భావి తరాలకు దేశభక్తిని, స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నారని చెప్పారు. ఆయన ఇప్పటి పాకిస్థాన్ లో, అప్పటి అఖండ భారతదేశంలో పుట్టిన విషయాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు.

 భగత్ సింగ్ స్ఫూర్తితో ముందుకెళతా: పవన్  

చిన్నప్పటి నుంచి తాను భగత్ సింగ్ అభిమానిని అని, ఆయన స్ఫూర్తితో ముందుకెళతానని చెప్పారు. ఆయనకు జరిగిన అన్యాయాన్ని చూసి తన గుండె తరుక్కుపోయిందని చెప్పారు.

సచిన్ తో పోలికతో.. 

 సినీ రంగంలోకి రాకముందు తన జీవితంలో జరిగిన కొన్ని అంశాలను అభిమానులతో పంచుకున్నారు. తాను పనీపాటా లేకుండా తిరగడం చూసిన కుటుంబ సభ్యులు క్రికెట్ దేవుడు సచిన్ తో పోల్చి విమర్శించేవారని వెల్లడించారు. 

'సచిన్ చూడు ఎలా ఆడుతున్నాడో, నువ్వెప్పుడు ప్రయోజకుడివి అవుతావు?' అని వారు అంటుంటే తనకు బాధ కలిగేదని, అయితే ఏదో సాధించాలని గుండెల్లో ఉన్నా, అందుకు తగ్గ నైపుణ్యాలు అప్పట్లో లేవని చెప్పారు.

ఆ బాధ నుంచి ఉపశమనం కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని, బాధ ఇలాగైనా తీరుతుందేమోనని సహచరులతో విపరీతంగా కొట్టించుకునేవాడినని అయినా అది తీరని వేదనలానే మిగిలిపోయిందని పేర్కొన్నారు.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles