Pawan janasena party inauguration program

Pawan Janasena party inauguration program, Chiranjeevi, Pawan Kalyan, Janasena party announcement, Hyderabad Hitex auditorium, Pawan Kalyan party Direct telecast

Pawan Janasena party inauguration program

పవన్ జనసేన పార్టీ కార్యక్రమ వివరాలు

Posted: 03/14/2014 03:22 PM IST
Pawan janasena party inauguration program

పవర్ స్టార్ గా పేరుగాంచిన తెలుగు సినీ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న సందర్భంగా కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయి.

పవన్ కళ్యాణ్ అన్న, మెగాస్టార్, కేంద్ర పర్యాటక శాఖామాత్యులు చిరంజీవి పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.  హైటెక్స్ ఆడిటోరియంలో 7000 వరకు అధికారికంగానే పాస్ లు జారీచేసిన సభలో చిరంజీవి పార్టీ ఉద్దేశ్యాలను వివరిస్తారు. 

సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని నోవోటెల్ ఎక్స్ పో ద్వారా పవన్ కళ్యాణ్ బృందం ప్రత్యక్షప్రసారం చేస్తుంది.  హైద్రాబాద్ తో సహా రాష్ట్రంలో 28 ప్రాంతాల్లో ఏర్పరచిన పెద్దసైజు స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ అభిమానులంతా దాన్ని వీక్షించగలుగుతారు. 

మీడియా, కార్ పాస్ లను బార్ కోడ్ తో జారీచేసారు.  దాని ప్రకారం ఆహ్వనితులందరి సీట్లూ రిజర్వ్ చెయ్యబడతాయి. 

పార్టీ గుర్తింపుకు, ఎన్నికల చిహ్నం కేటాయింపుకు సమయం తక్కువగా ఉండటం వలన ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి లభించటం కష్టం కాబట్టి ఈ సారి పోటీకి ఈ పార్టీ రాకపోవచ్చని, అయితే అధికారికంగా పోటీ చెయ్యకపోయినా, వారి అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థుల హోదాలో పోటీ చెయ్యటానికి అవకాశం ఉంటుందని కూడా ఊహాగానాలు వినవస్తున్నాయి.

ఇప్పటి వరకు పార్టీ గురించి, పార్టీ లక్ష్యాలు, పతాకం వగైరా వివరాలన్నీ సినిమా ఫక్కీలో టీజర్లలా విడుదలయ్యాయి. దానితో విపరీతమైన క్రేజ్ వచ్చింది.  కానీ అసలు ప్రకటన కోసం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 

అయితే ఈ పార్టీ వలన తమ గణాంకాల్లో తేడాలొస్తాయని కొన్ని పార్టీలు వేదన చెందుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles