Pawan janasena party entry pass id card

pawan kalyan, janasena party, janasena party entry pass ID Card, pawan janasena party entry pass ID Card, pawan speech live, pawan punch dialogue.

pawan janasena party entry pass ID Card

పవన్ ‘జనసేన’పార్టీ ఎంట్రీ పాస్ లుక్క్ అదుర్స్

Posted: 03/14/2014 04:27 PM IST
Pawan janasena party entry pass id card

పవన్‌ పార్టీకి కౌంట్‌డౌన్‌ మొదలైంది. నోవాటెల్ హోటల్‌లో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాత్రి 6.30 గంటలకు పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అభిమాన సంఘాల నేతలంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు. 

ఇక పవన్‌ ప్రసంగాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పవన్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారానికి ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. సీమాంధ్ర, తెలంగాణాల్లో కలిపి మొత్తం 28 లైవ్‌ పాయింట్లను సిద్ధం చేశారు. హైదరాబాద్‌లో ఏడు చోట్ల లైవ్ పాయింట్లను రెడీ చేశారు. ఇందుకోసం ఫంక్షన్‌ హాల్స్, థియేటర్లు, స్టేడియంలు, బస్టాండ్‌లనూ బుక్ చేశారు. 

సభకు 5 వేల మందికి మాత్రమే అనుమతి ఉంది. ఇప్పటికే వారందరికీ నిర్వాహకులు బార్‌కోడ్ పాసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఈ సభకు పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. 200 మందితో పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పాసులున్న వారినే లోనికి అనుమతిస్తామని మాదాపూర్‌ డీసీపీ స్పష్టం చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్ లోని పవన్ కళ్యాణ్ నివాసం ఎదుట అభిమానులు, అనుచరుల కోలాహలం నెలకొంది. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles