Notification for zptc mptc elections

Notification for ZPTC, MPTC elections, State election commission Ramakanth Reddy, Delay in local bodies elections in AP, Supreme Court order for local body elections, Assembly and Loksabha polls in AP

Notification for ZPTC, MPTC elections

జెడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్

Posted: 03/10/2014 02:05 PM IST
Notification for zptc mptc elections

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమర భేరీ మ్రోగింది.  షెడ్యూల్ ఈవిధంగా-

మార్చి 17 నుంచి 20 వరకు నామినేషన్లను స్వీకరించటం జరుగుతుంది.  మార్చి 21 న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.  నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ మార్చి 24.  ఏప్రిల్ 6 న పోలింగ్ నిర్వహిస్తారు.  అవసరాన్ని బట్టి రీపోలింగ్ 7 న నిర్వహించి, ఏప్రల్ 8 నుంచి వోట్ల లెక్కింపు పనిని చేపడతారు.  22 జిల్లాలో స్థానిక సంఘాల ఎన్నికలకు ఐఏఎస్ లను పరిశీలకులుగా నియమించామని ఎన్నికల సంఘం తెలియజేసింది. 

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంఘాల ఎన్నికలను నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి అన్నారు.  గతంలోనే ప్రభుత్వం స్పందించివుంటే ఈ శాసనసభ, లోక్ సభ ఎన్నికల గందరగోళం మధ్యలో స్థానిక సంఘాల ఎన్నికలను కూడా హడావిడిగా పెట్టవలసిన అవసరం వచ్చుండేది కాదని, అందుకు గత ప్రభుత్వానిదే బాధ్యతని ఆయన అన్నారు.  దీని వలన జిల్లాలోని ఎన్నికలను నిర్వహించే యంత్రాంగం మీద తీవ్రమైన ఒత్తిడి పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles