Supreme court notices to wb govt for gang rape

supreme court notices to WB Govt, Supreme Court of India, West Bengal Gang rape, Gang rape for loving other caste boy, Gang rape Birbam district

supreme court notices to WB Govt for gang rape

గ్యాంగ్ రేప్ మీద వివరణ కోరిన సుప్రీం కోర్టు

Posted: 01/24/2014 01:13 PM IST
Supreme court notices to wb govt for gang rape

పశ్చిమ బెంగాల్ లో కుల పెద్దలు విధించిన శిక్షలో 13 మంది సామూహిక అత్యాచారం చేసిన సంఘటన మీద సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికను కోరింది. 

కులాంతర ప్రేమ వ్యవహారం సాగించిన నేరానికి కుల పెద్దలే శిక్షగా 20 సంవత్సరాల మహిళ మీద సామూహిక అత్యాచారాన్ని విధించటం సంచలనం రేపింది.  విధించిన రూ.50000 రూపాయల జరిమానా చెల్లించలేకపోయినందు వలన అందుకు ప్రత్యామ్నాయంగా కులపెద్దలు సామూహిక అత్యాచారాన్ని శిక్షగా విధించారు. 

హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతోంది ఆ బాధితురాలు.

పంచాయతీ పెద్దలు, నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణైతే ప్రారంభించారు కానీ నిందితుల పోలీస్ రిమాండ్ కోరకపోవటం వలన అక్కడి ఎస్ పి ని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. 

ఈ ఘటన మీద సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానుంచి నివేదిక కోరుతూ నోటీసివ్వటం జరిగింది.

-శ్రీజ

Click on this for a related article

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles