Kejriwal may resign and sisodia may take his place

Kejriwal may resign,Manish Sisodia may take Kejriwal place, AAP in Parliament elections, Kejriwal to go national, AAP Arvind Kejriwal

kejriwal may resign and sisodia may take his place

కేజ్రీవాల్ రాజీనామా, ఆ స్థానంలో సిసోడియా

Posted: 01/22/2014 11:52 AM IST
Kejriwal may resign and sisodia may take his place

ఆఆపా నిర్వాహకుడు అరవింద్ కేజ్రీవాల్ కి విశ్వాసపాత్రుడిగానూ కుడిభుజంగానూ వ్యవహరిస్తున్న మనీష్ సిసోడియా ఢిల్లీ పీఠం మీద కేజ్రీవాల్ స్థానాన్ని అలంకరిస్తారన్న వార్తలు వస్తున్నాయి. 

ఢిల్లీ శాసన సభకు అఖండ విజయాన్ని సాధించి ప్రజాభిమానాన్ని చూరగొన్న కేజ్రీవాల్ తన పరిధిని పెంచుకుని జాతీయ స్థాయిలో దేశ వ్యాప్తంగా అవినీతి నిర్మూలనకు నడుం కట్టే ఆలోచనలు కనిపిస్తున్నాయి.  అందుకోసం ఆయన 2014 సాధారణ ఎన్నికలలో పార్లమెంటు స్థానాలకు ఆఆపా అభ్యర్థులను నిలబెట్టటమే కాకుండా స్వయంగా కూడా ఎన్నికల బరిలోకి దిగనున్నారు.

దాని వలన కేజ్రీవాల్ పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసేందుకు ఢిల్లీ శాసన సభ సభ్యత్వాన్ని, దానితో పాటు ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టవలసి వస్తుంది.  ఆ సమయంలో ఆఆపా ను ఢిల్లీలో నడిపించటానికి సిసోడియా సరైన నాయకుడని ఆఆపా విశ్వసిస్తోంది. 

ఇదేగనక జరిగితే ఢిల్లీ ఎన్నికల ఫలితాలే జాతీయ స్థాయిలో కనిపించవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా.  త్రిముఖ పోటీ అయితే అనివార్యమౌతుంది.  కాకపోతే ఫలితాలలో ఆ నిష్పత్తిలో తేడా కొద్దిగా ఉండవచ్చు అంటున్నారు. 

ఏది ఏమైనా, నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ ల మధ్య జరుగుతున్న అంచనాల యుద్ధం గాలి మళ్ళి మోదీ కేజ్రీవాల్ మధ్య జరిగే అవకాశం ఉంది. 

అంతకు ముందు జి న్యూస్ లో పనిచేసిన మనీష్ సిసోడియా పెద్దగా ప్రజలలో తెలిసిన నాయకుడు కాకపోయినా, కేజ్రీవాల్ బాగా విశ్వసిస్తూ తనతో పాటుగా అన్ని కార్యక్రమాలలో వెంట పెట్టుకుని కనిపిస్తుండటం వలన ఆ విధంగా సిసోడియా నలుగురి దృష్టిలోకి వచ్చారు.  అందువలన కేజ్రీవాల్ స్థానాన్ని సిసోడియా పూరించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles