Manishankar set up a tea stall for modi

mani shankar aiyar, modi, bjp,tea stall owner, Modi has demonstrated,

mani shankar aiyar says Modi will never become the prime minister of the country

మోడీ.. టీ దుకాణం పెట్టుకో..

Posted: 01/17/2014 04:18 PM IST
Manishankar set up a tea stall for modi

బిజెపి ప్రధాని అభ్యర్థి మోడీపై కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్  తన వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. దేశంలో బిజెపి ప్రభావం చాలా తక్కువగా ఉందని , ఈ నేపధ్యంలో  ఆ పార్టీ మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో  చిన్న పార్టీలు సైతం బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు వెనుకాడుతున్నాయని  దుమ్మెత్తి పోశారు. ఇది పార్టీ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయ మన్నారు.

అందుకే నంరేంద్రమోడీ టీ దుకాణం పెట్టుకుంటే మంచిదని, అందుకు తాను ఎఐసిసి ప్రాంగణంలో తగిన ఏర్పాట్లు కూడా చే్స్తానని అన్నారు. మరోవై పు ప్రధాని సైతం నరేంద్రమోడీపై విమర్శనాస్ర్తాలు  సందించారు. ఆయనపై పరోక్షంగా  వ్యాఖ్యానిస్తూ  భారత దేశంలో లౌకికవాదానికి గండికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. . ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో అల్లర్లకు కొన్ని విచ్చిన్నకరశక్తులే  కారణమన్నారు. దేశంలో ఉన్న భిన్నత్వంలోని ఏకత్వాన్ని దెబ్బతీస్తూ కొందరు  కుట్రలు పన్ను తున్నారని వారివిషయంలో అప్రమత్తంగా  ఉండాలన్నారు. 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles