15 ysrcp mlas suspended

15 YSRCP MLAs suspended, YSR Congress party

15 YSRCP MLAs suspended

15 మంది వైకాపా సభ్యుల సస్పెన్షన్

Posted: 01/09/2014 12:40 PM IST
15 ysrcp mlas suspended

ఈరోజు శాసన సభలో గందరగోళాన్ని సృష్టించి సభను సాగకుండా చేస్తున్నందుకు 15 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ శాసన సభ్యులను శాసనసభ సస్పెండ్ చేసింది.

అయితే వైకాపా పన్నాగాన్ని తెదేపా నిన్నటి నుంచే బయటపెడుతోంది.   సస్పెండై విభజనకు తోడ్పడాలనే వైకాపా ఉద్దేశ్యమని, తద్వారా విభజన బిల్లు మీద ఓటింగ్ జరిగే సందర్భంలో మెజారిటీ తగ్గిపోవటమే ధ్యేయంగా వైకాపా అడుతున్న నాటకమని తెదేపా ముందే విమర్శించింది.  

వైయస్ జగన్ సమైక్యం ముసుగువేసుకున్న విభజనవాదని, విభజనకు ఊతమిచ్చేందుకు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని శాసన సభ్యుడు దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.  రాజకీయ లబ్ధికోసమే సస్పెండ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని తెదేపా నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించారు.  

వాయిదా తర్వాత రెండవసారి సమావేశమైన శాసనసభలో వైయస్ ఆర్ శాసన సభ్యులు మరోసారి స్పీకర్ పోడియం దగ్గర కూడి ఆందోళన చేస్తూ సభ ముందుకు సాగకుండా చెయ్యటం మొదలుబెట్టారు.  దానితో శాసనసభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ ఆ 15 మందిని సస్పెండ్ చెయ్యవలసిందిగా సభాపతికి సిఫారసు చేసారు.  

ఆ సిఫారసుల మీద నిర్ణయం తీసుకుని ఒకరోజుకి సస్పెండ్ చేస్తూ, సస్పెండైన సభ్యులు వెంటనే బయటకు వెళ్ళిపోవాలని సభాపితి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఈ ఒక్కరోజులో శాసనసభలో ఏం జరుగుతుందో చూడాలి! 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles