Aap caps objected by congress

AAP caps objected by Congress, Amethi open discussion, AAP partyment beaten by Congress party, AAP men chased by Congress party men

AAP caps objected by Congress

ఆప్ టోపీలతో చిక్కు

Posted: 01/08/2014 02:43 PM IST
Aap caps objected by congress

సామాన్యుడి (ఆమ్ ఆద్మీ) టోపీ సామాన్య ప్రజానీకంలో కలిసిపోకుండా చేస్తోంది.  ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, సభ్యులకు టోపీ గుర్తింపైంది.  ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కూడా దానికి హాజరవటానికి వేరే గుర్తింపు కార్డ్ లు కానీ పాస్ లు కానీ లేవు.  కేవలం ఆప్ టోపీ పెట్టుకోవాలి అది లేకపోతే గుమ్మం దగ్గరే వాటిని పెట్టి ఉంచారు వాటిని తల మీద పెట్టుకుని లోపలికి పోవాలంతే అని చెప్పారు. 

ఉన్నట్టుండి ప్రభంజనంలా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఇతర పార్టీలకు గుర్రు ఉండటం సహజమే.  ఊహించని రీతిలో పైకి ఎదిగి రోజురోజుకీ బలోపేతమౌతున్న ఆమ్ ఆద్మీ పార్టీ వైపు అందరూ మొగ్గు చూపించటం మరీ వేధిస్తోంది.  ఎక్కడ పార్టీలో పనిచేసేవాళ్ళు అందులోకి వెళ్ళిపోతారో అనే భయమొకటి వెంటాడుతోంది.  దీనంతటికీ కారణమైన ఆమ్ ఆద్మీ పార్టీ మీద అసహనం కలుగుతోంది, వాళ్ళ టోపీలను చూసినప్పుడు వాళ్ళకా వ్యతిరేక భావన తారస్థాయికి పోతోంది.

రాహుల్ గాంధీ సొంత ఇలాకా అయిన అమేథీలో రామ్ లీలా గ్రౌండ్ లో ఒక టివి ఛానెల్ నిర్వహించిన బహిరంగ చర్చ జరుగుతున్న సమయంలో ఆప్ టోపీలను చూసిన కాంగ్రెస్ పార్టీ సభ్యులకు అరికాలి నుంచి మంట ప్రారంభమై పై వరకు వచ్చింది.  ఆ టోపీలు పక్కకు పెట్టి వేదికమీదకు రండి అని అనటంతో ఆప్ సభ్యులకు కూడా కాస్త మండింది.  కానీ లోలోపల సంతోషమూ కలిగింది వాళ్ళకి కలిగిన గుర్తింపుకి. 

అంతే.  చిన్నగా మొదలైన సురసురలు చిలికి చిలికి గాలి వానైనట్లుగా వ్యతిరేకతను చూపించటానికి చేతులు కాళ్ళను కూడా వాడారు కాంగ్లెస్ పార్టీవాళ్ళు.  ఇలాకా కాంగ్రెస్ పార్టీదవటంతో ఆప్ పార్టీ వాళ్ళకే తన్నులు తినవలసివచ్చింది.  అంతే కాదు అక్కడినుండి పలాయనం చిత్తగించవలసివచ్చింది. 

అయితే దీన్ని తేలిగ్గా తీసుకున్న ఆప్ పార్టీ నాయకులు అబ్బే చాలా చిన్న సంఘటనంతే. ఏం కాలేదు అని సర్ది చెప్పారు.  కేవలం ఆప్ పార్టీ వాళ్ళని తరిమేసారంతే అన్నారు పార్టీ అమేథీ ఎన్నికల ఇన్ ఛార్జ్ ఆదర్శ్ వాజ్ పేయ్. 

దీనంతటికీ కారణం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేకమైన టోపీలే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles