Jp says state is becoming pak and bangladesh

JP says state is becoming Pak and Bangladesh, protests in AP Assembly, Loksatta party, Jayaprakash Narayana

JP says state is becoming Pak and Bangladesh

రాష్ట్రం బంగ్లాదేశ్ పాకిస్తాన్ లా మారుతోంది- జెపి

Posted: 01/07/2014 03:19 PM IST
Jp says state is becoming pak and bangladesh

శాసన సభ, మండలిలో జరుగుతున్న ఆందోళనల పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఇంతకంటే రాజకీయాలు దిగజారుడు చూడం అని లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర అన్నారు.  అధికారంలో ఉన్న పార్టీ సభ్యులే సభలో గందరగోళాన్ని సృష్టించటం ప్రజాస్వామ్యానికి చెడు చేస్తుందని ఆయన అన్నారు. 

పబ్బం గడుపుకోవటానికి ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రాన్ని చివరకు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లలాగా తయారు చేస్తున్నారని జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. 

రాష్ట్ర పునర్విభజన బిల్లు ముసాయిదా వచ్చిన దగ్గర్నుంచి శాసన సభ సాగటం మానేసింది.  ప్రతిరోజూ ఆందోళనల మధ్య సభాపతి సభను వాయిదాలు వేస్తుండటం జరుగుతోంది.  అన్ని పార్టీలలోనూ ప్రాంతీయంగా విభజన జరిగిపోయింది.  కానీ ఇరు ప్రాంతాల వారూ సభను అడ్డుకుంటున్నారు.  డిమాండ్ ఏమైనా కావొచ్చు-  తెలంగాణా బిల్లు మీద చర్చ జరగాలని, వద్దని, సమైక్య రాష్ట్రంగా ఉంచాలనే ప్రతిపాదనలు చెయ్యాలని అలాంటివి ఏమైనా.

పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రజల మధ్య వచ్చిన వైషమ్యాలలాగా రాష్ట్రంలో కూడా తెలంగాణా ఆంధ్రా ప్రాంత వాసుల మధ్య వైషమ్యాలు పెరిగిపోవటానికి రాజకీయ నాయకుల స్వార్థపూరిత చింతనే కారణమని జెపి విమర్శించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles