Protests in and outside of ap assembly

Protests in and outside of AP Assembly, AP State Reorganization bill, Telangana bill, AP Assembly BAC, OU Tense

Protests in and outside of AP Assembly

అసెంబ్లీ లోపలా బయటా ఆందోళనలు

Posted: 01/07/2014 01:10 PM IST
Protests in and outside of ap assembly

రాష్ట్ర పునర్విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన దగ్గర్నుంచి సభను ముందుకు సాగకుండా, బిల్లు మీద చర్చ జరగకుండా శాసన సభ్యులు, మండలి సభ్యుల ఆందోళనలు సాగుతున్నాయి.  జనవరి 3 నుంచి బిల్లు మీద చర్చ జరుగుతుందని భావించినా ప్రతి రోజు సభ సజావుగా సాగకుండా ఇరు ప్రాంతాల వారి ఆందోళనల నడుమ సభ సాగే అవకాశం కనిపించక వాయిదాలు పడుతున్నాయి.  బిఏసి లో కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. 

ఇది ఇలా ఉండగా అసెంబ్లీ గేట్ 3 కి ఎదురుగా నిజాం కాలేజ్ విద్యార్థులు తెలంగాణా బిల్లుని ఆమోదించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.  దానితో పోలీసులు 30 మంది విద్యర్థులను అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

ఇది ఇలా ఉండగా చలో అసెంబ్లీ నినాదంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ర్యాలీ ప్రారంభించారు.  ఆంక్షలు లేని తెలంగాణా కావాలన్నది వారి డిమాండ్.  పోలీసులు అడ్డుకోగా బ్యారికేడ్లను తొలగించే ప్రయత్నం విద్యార్థులు చేసారు.  పోలీసులు లాఠీ చార్జ్ చెయ్యగా విద్యార్థులు పోలీసుల మీద రాళ్ళు రువ్వుతూ ప్రతిఘటించారు.  పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించగా ఒక విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.  విద్యార్థినిని హాస్పిటల్ కి తరలించారు కానీ ఘర్షణ కొనసాగుతూనేవుంది. 

మరోపక్క పాలెం బస్సు ప్రమాదంలో చనిపోయినవారి బంధువులు కూడా చలో అసెంబ్లీ కార్యక్రమానికి పూనుకోగా పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు.  బాధితుల కుటుంబ సభ్యులు హిమాయత్ నగర్ లోని ఏఐటియుసి కార్యాలయం నుంచి ర్యాలీ గా బయలు దేరారు.  అయితే వారిని పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles