Isro successful launch of gslv d5

ISRO successful launch GSLV-D5, ISRO, Indian Space Research Organisation,GSLV-D5, GSAT-14, Communication satellite,India

GSLV-D5 with the indigenous cryogenic engine lifted-off successfully as per schedule from the spaceport at Sriharikota.

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి జీఎస్ఎల్వీ డి-5

Posted: 01/05/2014 05:57 PM IST
Isro successful launch of gslv d5

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్ర్తో) ఇరవయ్యేళ్ళ కల నెరవేరించింది. ఇస్ర్తో ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన పీఎస్ ఎల్ వీ ప్రయోగాలు ప్రయోగించినా, వాటికంటే పెద్దదిగా చెప్పుకునే జీఎస్ఎల్వీ ప్రయోగాలను గతంలో చేసినా అవి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలం అవ్వడంతో ఈ సారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నేడు శ్రీహరి కోట నుండి గత కొద్ది సేపటి క్రితమే జీఎస్ఎల్వీ డీ-5 రాకెట్ ని విజయవంతంగా ప్రయోగించింది.

నిన్నటి నుండి నిరంతరాయ కౌంట్ డౌన్ మొదలు పెట్టిన ఇస్త్రో నేడు రాకెట్ ని నింగిలోకి పంపింది. ఈ వాహన నౌక 1980 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహాన్ని జీశాట్ 14ను మోసుకొని వెళ్లింది. ఈ జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం సక్సెస్‌తో ముందు ముందు అంతరిక్ష రంగంలో మరిన్ని కఠినతరమైన లక్ష్యాల్ని సులువుగా ఛేదించడానికి వీలవుతుందని ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ వెల్లడిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఉపగ్రహం తాలూకు ఖర్చు 45 కోట్లు కాగా, మొత్తం ఈ ప్రయోగం కోసం చేసిన ఖర్చు 205 కోట్లు. గతంలో ప్రయోగించినవి పూర్తి స్థాయిలో సక్సెస్ కాని విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles