Cbn second visit in kuppam

CBN second visit in Kuppam, Chandrababu Naidu second visit in Kuppam, Chandrababu to tour Kuppam, Naidu to visit Kuppam, telugudesam party, Chandrababu Naidu

CBN second visit in Kuppam, Chandrababu Naidu second visit in Kuppam, Chandrababu to tour Kuppam

కుప్పంలో చంద్రబాబు జోరు

Posted: 11/19/2013 12:17 PM IST
Cbn second visit in kuppam

రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, అదే నిర్ణయానికి కట్టుబడి వున్నామని సీమాంధ్రలో సమైక్య ఉధృతంగా జరుగుతున్నప్పుడూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర సమైక్యత కోసం పనిచేయాలనీ, తమ ఉద్యమానికి మద్దతివ్వాలనీ సమైక్యవాదులు చంద్రబాబుని కోరినా, తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేనని సెలవిచ్చిన ఘనుడు చంద్రబాబు.

 

అదే చంద్రబాబు, ఇంకా సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవే కావాలని కోరుకుంటున్నారట. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవకాశం వచ్చినా గతంలో వదులుకున్నాననీ, ఇకపైనా అదే మాటకు కట్టుబడి వుంటాననీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కన్నా, జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవకాశం గొప్పది కాదనీ పరోక్షంగా ముఖ్యమంత్రి పదవిపై తన ఆసక్తిని చంద్రబాబు బయటపెట్టుకున్నారు.

 

అయితే ఇప్పుడు చంద్రబాబు కుప్పంలో జోరుపెంచారు. మొదటి రోజు బాబు పర్యటన సాఫిగానే సాగింది. అయితే రెండో రోజు కుప్పంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయా ప్రాంతాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గం నుంచి వేలాది మంది ప్రజలు ఆయన్ని కలిసి తమ సమస్యల పై వినతి పత్రాలు సమర్పించారు. ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కుప్పం మండలలో పర్యటిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles