Chandrababu rages on congress for not allowing him into ap bhavan

Chandrababu rages on Congress for not allowing him into AP Bhavan, Chandrababu, AP Bhavan, Chandrababu Deeksha Continues In A P Bhavan, Chandra Babu Naidu to continu

Chandrababu rages on Congress for not allowing him into AP Bhavan

ఫ్లీజ్ .. అలా కొట్టొద్దు:చంద్రబాబు

Posted: 10/09/2013 01:45 PM IST
Chandrababu rages on congress for not allowing him into ap bhavan

రాష్ట్రం సమైక్యంగా ఉంచాలనే ఉద్దేశంతో.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు దీక్షను ఎలాగైన అడ్డుకోవలనే ప్రయత్నం చేస్తుంది. చివరకు ఏపీ భవన్ గేటుకు తాళాలు, కరెంట్, తాగునీరు, అన్నీ కట్ చేశారు. సమన్యాయం పేరుతో ఏపీ భవన్ లో బాబు చేస్తున్న దీక్ష మూడవ రోజుకు చేరింది. తాను చేపట్టిన దీక్ష ఢిల్లీ ఎన్నికలను ప్రభావితం చేది కాదని, ఇదంతా సోనియాగాంధీ ఆడే నాటకమని మండి పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, వైసిపి, టిఆర్ఎస్ తనను టార్గెట్ చేస్తూ రోజూ విమర్శిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ పెద్ద మనుషులే లేరన్నట్లు కాంగ్రెస్ పార్టీ తన ఇష్ట ప్రకారం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. తెలుగు ప్రజల కోసం నిర్మించిన ఏపీ భవన్ లోకి తెలుగు వారిని అనుమతించకపోవడం దారుణమన్నారు. నా మీద కోపంతో రాష్ట్ర ప్రజల పొట్ట కొట్టొద్దు' అంటూ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్లు తెరిచి, పద్దతి ప్రకారం సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు సూచించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles