Mmts train accident in nampally railway station

mmts train accident in nampally railway station, mmts train accident, nampally railway station, hyderabad, nampally rly station train accident, mmts train

MMTS Train Accident in Nampally Railway Station

నాంపల్లిలో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్ రైలు

Posted: 10/09/2013 10:20 AM IST
Mmts train accident in nampally railway station

ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో..ఎవరు చెప్పలేరు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న నాంపల్లి రైల్వే ప్లాట్ ఫారం ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈరోజు హైదరాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ లో లోకల్ రైలు ప్రమాదం జరిగింది. లింగంపల్లి-ఫలక్ నామా ఎంఎంటీఎస్ రైలు నాంపల్లి రైల్వే స్టేషన్ లో ప్రమాదానికి గురయింది. రెండవ నంబర్ ప్లాట్ పామ్ డెడ్ ఎండ్ ను ఢీకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. డ్రైవర్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమయింది. క్యాబిన్ లో ఇరుక్కునపోయిన డ్రైవర్ను సహాయక సిబ్బంది కాపాడారు. అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బ్రేకులు ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్ రైలు ప్రమాదంలో నాంపల్లి రైల్వే స్టేషన్ లో పలు రైళ్ల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ఆ సమయంలో లోకల్ ప్రయాణీకులు తక్కువగా ఉండటంతో.. పెను ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles