Mla jp too compares ys jagan s case with nirbhaya

MLA JP Too Compares Ys Jagan s Case With Nirbhaya , Loksatta party, Jaya Prakash Narayan, CBI, YSRCP, YS Jagan case, Nirbhaya case, Loksatta party leader Jayaprakash Narayana

MLA JP Too Compares Ys Jagan s Case With Nirbhaya, Loksatta party leader Jayaprkash Narayana comments on the case of YS Jagan comparing it with Nirbhaya- a gang rape incident at Delhi that made entire nation lower its head in shame

జగన్ కేసు కు నిర్బయ కేసు సంబంధం ఏమిటి?

Posted: 09/24/2013 03:17 PM IST
Mla jp too compares ys jagan s case with nirbhaya

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అక్రమాస్తుల కేసు, మహిళల కోరకు కొత్త చట్టం ద్వారా వచ్చిన నిర్బయ చట్టం కేసుకు సంబంధం ఉందని రాజకీయ నాయకుడు జేపి అంటున్నారు. మహిళల రక్షణ విషయంలో నిర్భయ కేసు ఎలాంటిదో ప్రజల ప్రయోజనాలు, అవినీతి విషయంలో జగన్ కేసు అలాంటిదేనని లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. జాతి చరిత్రలోనే ఇదో చెప్పుకోదగ్గ కేసని ఆయన అన్నారు. కీలక నాయకులపై ఉన్న అన్ని అవినీతి ఆరోపణలపైనా త్వరితంగా విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. అవినీతి కేసుల్లో చాలా వరకు ప్రభుత్వాలే విచారణను అడ్డుకుంటున్నాయని బాహాటంగా అవినీతి పరునలు కాపాడుతున్నయని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి, మోసం చేస్తే ఏ దేశంలోనైనా అవమానంతో కుంగిపోతారని, మన దగ్గర మీసం మెలేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మధుకోడా, జయలలిత, ములాయం, లాలూ తదితరులపై ఏళ్ల తరబడి విచారణ జరుగుతున్నా ఒక్క కేసూ విచారణ పూర్తికాలేదని గుర్తు చేశారు. న్యాయపరిశోధనా సంస్థలను పూర్తిగా రాజకీయాల నుంచి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరారు. ఆస్తుల జప్తు చేయటంతోపాటు త్వరితగతిన విచారణ పూర్తి చేసి 20 ఏళ్ల వరకు శిక్షలు పడేలా కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles