Tdp mla supporters attack on kavuri sambasiva rao house

tdp mla supporters attack on kavuri sambasiva rao house, TDP MLA Chintamaneni Prabhakar Rao, kavuri sambasiva rao, Denduluru TDP MLA Chintamaneni Prabhakar

tdp mla supporters attack on kavuri sambasiva rao house, samaikyandhra supporters attack on kavuri sambasiva rao house

కావూరి ఇంటిపై టిడిపి ఎమ్మెల్యే అనుచరుల దాడి

Posted: 09/17/2013 12:54 PM IST
Tdp mla supporters attack on kavuri sambasiva rao house

సీమాంద్ర నాయకులకు ఉద్యమ సెగ తాకుతుంది. మొన్న టీజీ, నిన్న రాయపాటి, నేడు కావూరి లాంటి నాయకులకు సమైక్యవాదుల సెగ తప్పలేదు. రాజీనామా చేసిన రాయపాటికి సమైక్యవాదుల చేతిలో చేదు అనుభవం అయ్యింది. ఇక సొంత జిల్లాలోనే మంత్రి టీజీ వెంకటేష్ కు సమైక్యవాదులు చుక్కలు చూపించారు.ఇక  కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చింతమనేని ప్రభాకర్ అనుచరులు, సమైక్యవాదులు ఏలూరులోని కావూరి ఇంటిని ముట్టడించారు. వీరిని కావూరి అనుచరులు అడ్డుకోవడంతో ఘర్షణ ప్రారంభమయింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. దీంతో రెచ్చిపోయిన చింతమనేని అనుచరులు కావూరి నివాసంలోకి ప్రవేశించిన ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులు కలగజేసుకుని వీరిని చెదరగొట్టారు. పలువురి అదుపులోకి తీసుకున్నారు. కావూరిని అంతకుముందు కలపర్రు చెక్ పోస్ట్ వద్ద చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. దాంతో కావూరి తన ఎస్కార్ట్ వాహనంలో బయలుదేరి ఏలూరు నగరాన్ని చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులకే సమైక్యవాదులు సెగ ఎక్కువగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. వైసీపీ నాయకులు, టిడిపి నాయకులను సమైక్యవాదులు ఎందుకు అడ్డుకోవటం లేదని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. రాయపాటిని అడ్డుకున్న సమైక్యవాదులు టిడిపి కార్యకర్తలే అని ఆయన అన్నారు. ఇక టీజీని అడ్డుకుంది వైసీపీ రౌడీలని ఆయన అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles