Tdp mps fire on ys jagan deeskha

tdp mps fire on ys jagan deeskha, TDP fire on Jagan Deeksham Samaikhyandhra, ys jagan deeksha in jail, congress party, ysrcp, tdp, tdp mps,

tdp mps fire on ys jagan deeskha, ,TDP fire on Jagan Deeksha,

కాంగ్రెస్ రంగు జగన్ దీక్షతో బయటపడింది

Posted: 08/27/2013 05:29 PM IST
Tdp mps fire on ys jagan deeskha

కాంగ్రెస్ , వైకాపాల లోపాయికారి ఒప్పందం జగన్ దీక్షతో బట్టబయలైందని సీమాంద్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు అన్నారు. ఢిల్లీలో వారు మాట్లాడుతూ.. జగన్ ఆరోగ్య పరిస్థితి పై బులెటిన్ విడుదల చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. పార్లమెంట్ సభ్యులు దీక్ష చేస్తే పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారని ఆవేదరన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల జీవితాలతో తల్లి, పిల్ల కాంగ్రెస్ లు ఆడుకుంటున్నాయని ఆరో్పించారు. వైకాపా నేతలకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం కుమ్మక్కులో భాగం కాదా అని ఎంపీలు ప్రశ్నించారు. తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందడం, కాంగ్రెస్ లో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం కోసమే ఇదంతా చేశారని మండిపడ్డారు. జగన్ బెయిల్ కోసం వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకానికే విజయమ్మ ఢిల్లీ యాత్ర చేశారని వారు ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోవడమే న్యాయమేనా అన్ని ప్రశ్నించారు. మూడు ప్రాంతాల అంగీకారంతోనే విభజన ప్రక్రియ చేపట్టాలని శ్రీకష్న కమిటి చెప్పిందని ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles