Balakrishna second daughter wedding news

balakrishna second daughter wedding news, balakrishna daughter tejaswini marriage, Balakrishna daughter wedding

balakrishna second daughter wedding news, balakrishna daughter tejaswini marriage

బాలయ్య కుమార్తె తేజస్వివి పెళ్లి ముచ్చట్లు

Posted: 08/21/2013 01:49 PM IST
Balakrishna second daughter wedding news

బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని గీతం గ్రూప్‌ అధినేత ఎంవివిఎస్‌ మూర్తి మనవడు శ్రీభరత్‌ని వివాహం ఘనంగా జరిగింది. నేటి ఉదయం 8.52 నిమిషాలకు ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. హైదరాబాద్‌ హైటెక్స్‌ లో వివాహమహోత్సవ వేడుకకు సినీరాజ కీయ రంగ ప్రముఖులతో పాటు పారిశ్రామిక వేత్తలు, ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులంతా విచ్చేసారు. ఈ వివాహానికి చాలా మంది వివిఐపిలు మరియు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నందమూరి అభిమానుల రాకతో సందడి నెలకొంది. వివాహ వేడుకకు నారా చంద్రబాబు నాయుడు, రామోజీరావు, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, చిరంజీవి, జైపాల్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, 'ఈనాడు' ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివరావు, తేదేపా నేతలు యనమల రామకృష్ణుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అంబికాకృష్ణ, దేవినేని ఉమా, కరణం బలరాం, భాజపా నేత బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. తదితరులు హాజరయ్యారు. దాదాపు నందమూరి ఫ్యామిలీ లోని అందరూ ఈ వివాగా వేడుకకి విచ్చేసి దగ్గరుండి ప్రత్యేకంగా అక్కడి ఏర్పాట్లు చూసుకున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles