Bjp bihar for modi as pm candidate

BJP Bihar for Modi as PM Candidate, Prime Minister Candidate Modi, Bharatiya Janata Party, Narendra Modi, Gujarat Chief Minister

BJP Bihar for Modi as PM Candidate

ప్రధాన మంత్రి అభ్యర్థి మోదీయే-భాజపా తీర్మానం

Posted: 08/17/2013 05:52 PM IST
Bjp bihar for modi as pm candidate

ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరునే ప్రతిపాదించిన భారతీయ జనతా పార్టీ బీహార్ శాఖ ఆయన పేరునే ఖరారు చెయ్యటమే కాక ఆ దిశగా ప్రకటన జరగాలని పార్టీని కోరింది.

విచిత్రమేమిటంటే అదే బీహార్ రాష్ట్రంలో మోదీ మూలకంగానే భాజపా రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో భాగస్వామ్యాన్ని కోల్పోయింది.  జనతా దళ్ నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో 17 సంవత్సరాల బంధం తెగిపోయింది.   కానీ అదే బీహార్ రాష్ట్రం నరేంద్ర మోదీ ని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించటంలో మొట్టమొదటి రాష్ట్రమైంది.

రెండు రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం బీహార్ లోని బోధ్ గయ లో జరుగుతోంది.  అందులో వచ్చిన చర్చలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి, ఎన్నికల ప్రచార సారధియైన నరేంద్ర మోదీ ప్రకటన జరగాలని తీర్మానించింది. 

అయితే పార్టీ తరఫునుంచి ప్రకటన చెయ్యటం ఇంకా అవలేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles