Vh faced samaikyandhra protest

VH faced samaikyandhra protest, VH at Tirupati, Samaikyandhra protesters stop VH vehicle, V Congress leader Hanumantha Rao

vh faced samaikyandhra protest

తిరుపతి నుంచి బయటపడ్డ విహెచ్ వేసిన మరో బాంబు

Posted: 08/17/2013 02:41 PM IST
Vh faced samaikyandhra protest

తిరుమలేశుని దర్శనార్ధం వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు సమైక్యాంధ్ర ఉద్యమ రుచిని చవిచూసారీరోజు.  విహెచ్ వాహనం పై చెప్పులు విసిరి, కారుకి అడ్డంగా పడుకుని సీమాంధ్ర ఉద్యమకారులు తమ నిరసనలను తెలియజేసారు.  చివరకు పోలీసులు లాఠీ చార్జ్ చేసి విహెచ్ ని క్షేమంగా అలిపిరి దాటించారు.  భద్రతా దృష్ట్యా అలిపిరి దాటిన విహెచ్ ని వేరే వాహనంలోకి మార్చి తిరుపతి విమానాశ్రయానికి తరలించారు.

విహెచ్ తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారని తెలిసి అలిపిరి ఆయన వాహనాన్ని అడ్డుకోవటానికి భారీ సంఖ్యలో ఉద్యమకారులు వేచి చూస్తున్నారన్న విషయంతెలిసిన విహెచ్ తన కుటుంబ సభ్యులను ముందుగా తిరుపతి పంపించేసి కొండ దిగకుండా పోలీసుల నుంచి అంతా నియంత్రణలో ఉందన్న సమాచారం కోసం కాటేజ్ లోనే చాలా సేపు ఉండిపోయారు. 

ఆ తర్వాత విహెచ్ మాట్లాడుతూ ఉద్యమాలను నాయకులే నడిపిస్తున్నారని చెప్తూ, ఏపి ఎన్జీవోల సమ్మె సరైనది కాదని, వాళ్ళు హైద్రాబాద్ వదిలి వెళ్ళవలసిందేనని, అయితే ఉద్యోగులు కాకుండా మిగిలినవారిని హైద్రాబాద్ లో ఉండనిస్తామని అన్నారు.

ఇలాంటి ప్రకటనే కెసిఆర్ లోగడ చెయ్యటంతో సీమాంధ్రలో ఆందోళన పెల్లుబికి ఉద్యమం బాగా రాజుకోవటం జరిగింది. తనకి జరిగిన అవమానంతో చేసిన ఈ వ్యాఖ్య మరెంత ఆందోళనలకు దారితీస్తుందో అని రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రయోజనాన్ని ఆశించేవారు భయపడుతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles