No time limit for antony committee

no time limit for antony committee, Defence Minister Antony, Digvijay Singh, CWC decision on AP bifurcation, Seemandhra agitation, samaikyandhra movement, Kiran Kumar Reddy, Botsa Satyanarayana

no time limit for antony committee

ఆంటోనీ కమిటీకి టైమ్ లిమిట్ లేదు

Posted: 08/10/2013 10:29 AM IST
No time limit for antony committee

శుక్రవారం సాయంత్రం దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో మీడియా ముందు మరో సంచలన వ్యాఖ్య చేసారు- ఆంటోనీ కమిటీకి ఇదమిద్ధంగా ఇంత సమయం అంటూ నిర్ధారణగా లేదని. 

రాష్ట్ర విభజన మీద సిడబ్లుసి తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించగానే ఉవ్వెత్తుగా లేచిన సీమాంధ్ర ఆందోళనల నేపథ్యంలో పరిస్థితులను సమీకరించటానికి కేంద్రం నలుగురు సభ్యుల కమిటీని ఒకదాన్ని రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. 

అందులో ఒక సభ్యుడైన కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ని పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణని కమిటీ ముందుకి రాదలచుకున్నవాళ్ళ జాబితాను తయారు చెయ్యమని చెప్పానన్నారు.  ఆంటోనీ ఎన్నో కీలకమైన వ్యవహారాలను చక్కబెడుతూ పనులలో వ్యస్తులైవుంటారు కాబట్టి ఆయనకు అనుకూలమైన సమయాన్ని కేటాయించి రాష్ట్రం నుంచి విభజన విషయంలో వచ్చే ఫిర్యాదులను సూచనలను వినటం జరుగుతుందని అన్నారు. 

మరి ఇదంతా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పటికి పూర్తవుతుంది అని అడిగిని ప్రశ్నకు, చెప్పలేం, ఆంటోనీ చాలా బిజీగా ఉంటారు.  పార్లమెంటు వ్యవహారాలు ఇంకా ఎన్నో ఉన్నాయి కనుక ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం, అలాగే కమిటీకి టైం లిమిటనేది లేదు కాబట్టి ఎప్పటి వరకు సాగుతుందో కూడా చెప్పలేమన్న సంకేతాన్నిచ్చారు దిగ్విజయ్ సింగ్. 

నిన్న మరో సందర్భంలో మాట్లాడుతూ, కమిటీ అనేది ఉన్నది సమస్యలను పరిష్కరించుకోవటానికే అంతే కానీ తెలంగాణా విషయంలో సిడబ్లుసి నిర్ణయం జరిగిపోయింది కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవటానికి ఏర్పాటైన కమిటీ కాదని స్పష్టంచేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles