15 andhra tdp mlas resign

15 Andhra TDP MLAs resign, andhra pradesh, seemandhra, telangana, tdp,

Fourteen MLAs of main opposition the Telugu Desam Party faxed their resignations to Andhra Pradesh Assembly Speaker office on Monday night, protesting that the Centre did not give firm assurance on protecting the interests of people in the proposed Andhra Pradesh state after the separation of Telangana.

15 మంది దేశం ఎమ్యెల్యేలు రాజీనామా

Posted: 08/02/2013 08:49 AM IST
15 andhra tdp mlas resign

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ప్రకటించడంతో సీమాంధ్రలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయి రాజీనామాలు చేస్తుంటే, మేమెందుకు చేయకూడదనుకున్నారో ఏమో కానీ సీమాంధ్ర టీడీపీ నాయకులు కూడా రాజీనామాల బాట పట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ కి చెందిన 8 మంది ఎంపీలు, 24 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా లేఖల్ని సమర్పించారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తన పదవులకు రాజీనామా చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు తెలంగాణ పై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పడంతో హడాహుడి చేయకుండా ఉన్నవీరు కాంగ్రెస్ వారు రాజీనామాలు చేయడంతో ప్రజల్లో సానుభూతి పొందడానికి వీరు రాజీనామా బాట పట్టారు. .దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, అబ్దుల్ గని, శ్రీరాం తాతయ్య, లింగారెడ్డి, తంగిరాల ప్రభాకర్, కందికొండ ప్రసాద్, శమంతకమణి, మెట్టు గోవిందారెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతి నేని శ్రీనివాసరావు, జీవి ఆంజనేయులు, పార్థసారథి, ఆనందబాబు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.కాంగ్రెస్ అదిష్టానం చేసిన అన్యాయానికి నిరసనగా రాజీనామలు చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ రాజీనామాల వెనక చంద్రబాబు హస్తం ఉందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles