నిన్నటి వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ విధ్యార్థులు బలిదానం చేశారు. దాదాపు గా వేల మంది బలిదానమయ్యరు. ఇప్పుడు అదే బాటలో సమైక్యాంద్ర కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రం విభజన జరిగిందని తెలిసి ఆంధ్ర ప్రాంత యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమైక్యాంధ్ర కోసం ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకుంటే, మరో వ్యక్తి మనఃస్తాపంతో గుండెపోటుతో మృతి చెందారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడిలో తమటపు శ్రీనివాసరావు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాసరావు విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. విభజనను నిరసిస్తూ గుంటూరులో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.అనంతపురంలో మరో యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే అతడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే అతడి పరిస్థితి విషమంగా మారటంతో చికిత్స కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నాగవంశపు వీధికి చెందిన కనకం చిన్నప్పుడు రాష్ట్రం విడిపోతుందని తెలిసి తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు.
(And get your daily news straight to your inbox)
Feb 27 | సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలసినన ఇల వైకుంఠపురంగా భక్తుల కొంగుబంగారంగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తిరువేంకటేశ్వరుడికి ఆర్జిత సేవలు నిర్వహించేందుకు భక్తులు అసంఖ్యాకంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు... Read more
Feb 27 | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మూడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒక రకంగా, పశ్చిమ బెంగాల్ ను మరో రకంగా చూడటం... Read more
Feb 27 | తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరుల త్యాగాల మీద అడుగులు వేసుకుంటూ అధికారాన్ని చేపట్టిన కేసీఆర్.. తెలంగాణ అంటే తానొక్కడే అన్న చరిత్రను... Read more
Feb 26 | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు తాజా షెడ్యూల్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ... Read more
Feb 26 | యావత్ దేశం ఇంధన ధరల పెంపుపై భగ్గుమంటోంది. ప్రజలను ఇంధన ధరల పెంపుపై పెదవి విరుస్తుండగా, ఈ ధరాఘాతాన్ని విపక్షాలు తమ తమ స్థాయిలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై అస్త్రాలుగా సంధించుకుంటున్నాయి. ఈ క్రమంలో... Read more