Final phase panchayat elections concluded

final phase panchayat elections, AP Panchayat elections, Panchayat elections for Sarpanchs, Panchayat elections for ward members, panchayat polling peaceful in AP

final phase panchayat elections concluded

ముగిసిన తుది విడత పంచాయితీ ఎన్నికలు

Posted: 07/31/2013 01:36 PM IST
Final phase panchayat elections concluded

రాష్ట్రంలో తుది విజత పంచాయితీ ఎన్నికలు ఈ రోజు ఒంటిగంటకు ముగిసాయి. 
పోయిన రెండుసార్లు చేసినట్లుగానే ఒంటిగంట వరకు క్యూలో చేరిన ఓటర్లను ఓటు వెయ్యటానికి అనుమతించమని రాష్ట్ర ఎన్నికల అధికారి నవీన్ మిట్లల్ ఆదేశాలను పాటిస్తున్నారు. 
చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందంటూ అధికారులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.  మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే ఓట్ల లెక్కింపు ఈ రోజు సాయంత్రం వరకు పూర్తై ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.  
భారీ వర్షాల వలన కొన్ని పంచాయతీల్లోని ఓటర్లు పోలింగ్ స్టేషన్ కి చేరుకోవటం కష్టమైంది.  గుంటూరు జిల్లాలోని పెద్ద రెడ్డిపాలెంలో ఓటర్లు బ్యాలెట్ బాక్స్ లను ఎత్తుకెళ్ళి బావిలో పడవేయగా పోలీసులు అడ్డుకోజూసారు.  దానితో వాళ్ళ మీద ఓటర్లు దాడిచేసారు.  పోలింగ్ కేంద్రం మీద రాళ్ళను కూడా విసిరారు.  దానితో ఎస్ ఐ భుజంగరావు గాయపడి స్పృహతప్పారు.  నల్గొండ జిల్లాలో కొన్ని పంచాయితీలలో కాంగ్రెస్, తెదేపా నాయకుల మధ్య తోపులాటలు జరిగాయి.  ఇవి మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లేనని అధికారులు అన్నారు. 
తుది విడత పోలింగ్ 64.1 శాతం జరిగిందని,  అధికంగా ప్రకాశం జిల్లాలో 76.7 శాతం ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని,  కనిష్టంగా మహబూబ్ నగర్ జిల్లాలో 51.8 శాతం మాత్రమే ఉపయోగించుకున్నారని అధికార లెక్కలు తెలియజేస్తున్నాయి. 
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles