Cwc to take decision on telangana issue digvijaya

cwc meet to finalise, cwc to take decision on telangana issue, digvijay singh, congress core group meeting, cwc meeting for final decision on telangana, cwc to take final call on telangana, breaking news, ap politics, political news, andhra news

CWC to take decision on Telangana issue Digvijaya, Congress Working Committee, CWC Meet to Finalise

నాకేం తెలియదు దిగ్విజయ్ సింగ్

Posted: 07/29/2013 01:14 PM IST
Cwc to take decision on telangana issue digvijaya

తెలంగాణ వాసులకు స్వీట్ కబురు వస్తుందని చెప్పిన దిగ్విజయ్ సింగ్ నోటి నుండే .. నాకేం తెలియదు అని మాటలు జారిపడ్డాయి. ఆంద్రప్రదేశ్ కు ఇన్ ఛార్జీ అయిన వెంటనే రాజకీయ నాయకుల్లో ప్రకంపనాలు స్రుష్టించిన విషయం తెలిసిందే. అలాంటి డిగ్గీ రాజ ఇప్పుడు నాకేం తెలియదు అని చెప్పటం అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దేని గురించి చర్చిస్తారో తనకు తెలియదని రాష్ట్ర కాంగ్రెస్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. యూపీఏ సమన్వయ కమిటీలో తాను సభ్యుడిని కాదన్నారు. కాబట్టి అక్కడ కూడా ఏమి చర్చిస్తారో తనకు తెలియదని దిగ్విజయ్ చెప్పుకొచ్చారు. తెలంగాణ సమస్య 1999 నుంచి తమ పరిశీలనలో ఉందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఏన్డీఏ మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి తమకు లేఖ పంపారన్నారు. రేపు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని .. తెలంగాణ నాయకులు, సీమాంద్ర నాయకులు ఆందోళన చెందుతున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles