Tv anchor molested in howrah

Howrah station,anchor molested, kolkata, howrah railway station, tv anchor, tv anchor mumbai based channel

A Mumbai-based TV anchor was allegedly molested by an inebriated man who was later arrested, police said Wednesday..

యాంకర్ పై వేధింపులు

Posted: 07/24/2013 08:00 PM IST
Tv anchor molested in howrah

మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ టివి యాంకర్‌ను పశ్చిమ బెంగాల్‌లోని హౌరా రైల్వే స్టేషన్ సమీపంలో తీవ్రంగా వేధించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన టివి యాంకర్ తన తండ్రి, ఒక స్నేహితుడితో కలిసి కోల్‌కతా నగరాన్ని చూసేందుకు వచ్చారు. వీరు హౌరా రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకోగానే రతన్ సాహు అనే వ్యక్తి ఆమెను వేధించాడు. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం అతనిని బెయిల్ పైన విడుదల చేశారు. తనపై దాడి చేసిన వ్యక్తిని ఎదుర్కోవడానికి ఆమె ప్రయత్నించారు. కారులో ఉన్న యాంకర్‌ను సాహు బయటకు లాగే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో నిందితుడు ఆమె తండ్రి పైన దాడికి పాల్పడ్డాడు. ఈ వేధింపుల సమయంలో ఆమె తండ్రి పై దాడి చేయడంతో అతను ప్రతిఘటించడంతో స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే ఈ సంఘటన జరుగుతున్న సేపు అక్కడ ఉన్న జనం సినిమాని చూసినట్లు చూడటం కొనమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles