Hit and run case on salman khan

salman khan hit and run case, 2002 car accident Salman case, culpable homicide, Actor Salman Khan, Salman Khan rash driving, Salman kills with rash driving

hit and run case on salman khan

సల్మాన్ ఖాన్ మీద కల్పబుల్ హోమిసైడ్ కేసు

Posted: 07/24/2013 02:54 PM IST
Hit and run case on salman khan

2002 లో తాగి కారునడుపుతూ ఫుట్ పాత్ మీద పడుకుని ఉన్నవాళ్ళమీదకు పోనిచ్చి, ఒక మనిషికి ప్రాణ నష్టం, నలుగురికి గాయాలు చేసిన హిందీ సినిమా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మీద ఈరోజు ముంబై కోర్టు హిట్ అండ్ రన్ నేరారోపణ చేసింది.  ఇది హత్యచేసే ఉద్దేశ్యంతో కాకపోయినా హత్యానేరం కిందికి వస్తుంది.  ఇది రుజువైతే సల్మాన్ ఖాన్ కి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది.

ఈరోజు సెషన్స్ కోర్టు దీనిమీద తీర్పునివ్వవలసివుంది.  అయితే సల్మాన్ తాను నిర్దోషినని కోర్టులో చెప్పుకొచ్చారు.  ఆయన స్వయంగా కోర్టుకు రానవసరం లేకుండా మినహాయింపును కూడా ఇస్తూ కేసును మరో జడ్జ్ కి బదిలీ చెయ్యటం జరిగింది.

అంతకు ముందు మెట్రో పోలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సల్మాన్ ఖాన్ మీద బాధ్యతారహితంగా కారు నడిపిన కేసు నమోదైంది.  కానీ కేసులోని సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జ్ దీన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ ఎమౌంటింగ్ టు మర్డర్ గా కేసు నమోదు చేసారు.  17 మంది సాక్ష్యులను విచారించి కోర్టు హత్యచేసే ఉద్దేశ్యంతో కాకపోయినా హత్యానేరం కింద కేసుని నమోదుచేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles