First phase of panchayat elections tomorrow

First Phase of Panchayat Elections, Andhra pradesh, panchayat polls,

first phase of Andhra Pradesh Panchayat elections. he elections are slated on July 23, 27 and 31 across Andhra Pradesh.

రేపే తొలి విడత ఎన్నికలు

Posted: 07/22/2013 06:49 PM IST
First phase of panchayat elections tomorrow

రాష్ట్రంలో జరగనున్న పంచాయితీ పోల్స్ తొలి విడుత రేపు జరగబోతుంది. మొత్తం మూడు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి ఎన్నికల అధికారి నవీన్ మిట్టల్ చెప్పారు. తొలి విడతలో రాష్ట్రంలో మొత్తం 5803 పంచాయితీలకు రేపు ఉదయం 7 నుండి మధ్యాహ్నాం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు 4 గంటల వరకు జరుగుతుందని, ఇందులో వార్డు నెంబర్ల లెక్కింపు మొదట జరుగుతుందని, ఆ తరువాత సర్పంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆ తరువాత ఫలితాలు ఎన్నికల అధికారులు వెల్లడిస్తారని చెప్పారు. రేపు ఎన్నికయ్యే వార్డు సభ్యుల్లో సగం మంది హాజరైతేనే ఉపసర్పంచి ఎన్నిక ఉంటుందని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల వద్ద భారీ బందోబస్తును పెట్టినట్లు పేర్కొన్నారు. ఇక భారీ వర్షాల వరదల కారణంగా ఆటంకాలు ఏర్పడితే కలెక్టర్ల సూచనల మేరకు ఎన్నికలు తరువాత నిర్వహిస్తామని తెలిపారు.  రాష్ట్రంలోని 18 గ్రామ పంచాయితీల్లో వేలం పాట నిర్వహించినట్లు సమాచారం ఉండటంతో వాటి ఎన్నిక రద్దు చేశామని, త్వరలో వాటికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఇక పలు పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఓటింగ్ కేంద్రాలకు రప్పించేందుకు పలు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. మధ్యం కూడా ఏరులై పారుతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles