Cwc may meet on july 28 to take a call on telangana

CWC July 28 , Telangana, Indian National Congress, Andhra Pradesh, Digvijay Singh

A high-level source in the party said that a formal announcement on the CWC meeting could be expected after the Congress Core Committee

ఈనెల 28 తరువాత తెలంగాణ ?

Posted: 07/19/2013 08:32 AM IST
Cwc may meet on july 28 to take a call on telangana

కాంగ్రెస్ అధిష్టానం పార్టీ తెలంగాణ పై ఈనెల 28 తరువాత అటో ఇటో తేల్చడానికి సిద్ధం అయిందా ? అంటే అవుననే తెలుస్తుంది. మొన్న కోర్ కమిటీ సమావేశం తరువాత తెలంగాణ పై నిర్ణయాన్ని సీడబ్ల్యూసీలో తేలుస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ సీడబ్య్లూసీ సమావేశం ఎప్పుడుంటుందోననే సందేహం ఉండేది. కానీ తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి అత్యున్నత నిర్ణాయక సంస్థ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం ఈ నెల 28వ తేదీన జరగనుంది. ఈ నెల 28వ తేదీన అందుబాటులో ఉండాలి సీడబ్ల్యూసీ సభ్యులు 41 మందికి ఢిల్లీలోని ఎఐసిసి కంట్రోల్ రూమ్ నుంచి వారికి వర్తమానం పంపించారు. ఈ సమావేశంలో ప్రత్యేక తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 28వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశం తరువాత ఏదో ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఈనెల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగే ఆహార భద్రత బిల్లు సమావేశంలోనే తెలంగాణ పై నిర్ణయం తీసుకొని, అదే నిర్ణయాన్ని సీడబ్ల్యూసీలో చెబుతారని ఆ తరువాత ప్రకటన చేస్తారని అంటున్నారు. అయితే కొంత మంది తెలంగాణ నాయకులు పంచాయితీలు ఎన్నికల కోసమే ఆడుతున్న డ్రామాగా చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles